సోష‌ల్ మీడియా ఇది వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి దేశంలో ఎక్కెడెక్క‌డో జ‌రిగే విష‌యాల‌న్నీ ఇక్క‌డ తెలుస్తున్నాయి. ఎవ్వ‌రు ఏమి షేర్ చేసుకోవాల‌న్నా సోష‌ల్ మీడియాను వేదిక‌గా తీసుకుని వాళ్ళ సొంత భావాల‌ను వీటి ద్వారా పంచుకుంటున్నారు. అలాగే ఎవ‌రికైనా ఏదైనా చెప్పాల‌నుకున్నా, ఏమ‌న్నా మెసేజ్ ద్వారా సూచించాల‌నుకున్నా ఈ సోష‌ల్ మీడియానే వాడుతున్నారు. ఇందుల ర‌క ర‌కాలు ఉన్నాయి. ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, వాట్సాప్ ఇలా చాలా వేదిక‌లే ఉన్నాయి. అయితే వీటిలో కొంద‌రు మంచి ప‌నుల‌కు వాడితే మ‌రి కొంద‌రు చెడు ప‌నుల‌కు వాడుతున్నారు. ఇలాంటి ఖాతాల‌తో ఎంతో మందిని మోసం చేస్తున్నారు. కొన్ని ఫేక్ ఐడీల‌ను క్రియేట్ చేసి అమ్మాయిల‌తో చాటింగులు ఇలా ర‌క ర‌కాల అరాచ‌కాల‌కి యువ‌త పాల్ప‌డుతున్నారు. 

 

అయితే ఇటీవ‌లె ఇలాంటి ఘ‌ట‌న ఒక‌టి ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాధ్ కొడుకు పూరి ఆకాష్ మీద వ‌చ్చింది. 
 ఫేస్‌బుక్‌, ట్విట్టర్, వాట్సప్‌.. ఇలా డిఫరెంట్‌ వెబ్‌సైట్స్‌, యాప్స్‌ ప్రధానంగా సెలబ్రిటీలకు.. తమ ఫ్యాన్స్‌తో, ఫాలోవర్స్‌తో టచ్‌లో ఉండేందుకు వాహకాలుగా పనిచేస్తున్నాయి. అయితే.. ఒక్కోసారి అవే తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. కొందరి కన్నింగ్‌ చేష్టలు మొదటికే మోసం తెస్తున్నాయి. సినీ హీరోలు, ప్రముఖులు, సెలబ్రిటీల్లో అధికశాతం ట్విట్టర్‌ను వినియోగిస్తున్నారు. వాళ్ల అకౌంట్లను అనుసరిస్తున్నవాళ్ల సంఖ్య వేలు, లక్షల్లో కూడా ఉంటోంది. అయినా వారి పేరిట నకిలీ ఖాతాలు తెరిచే వారు కూడా రెచ్చిపోతున్నారు. తాజాగా ఆకాష్ పూరి పేరిట ఓ నకిలీ ఖాతాను తెరిచాడో యువకుడు. అది తెలియని కొంతమంది అమ్మాయిలు అది నిజమనే నమ్మడంతో వారిని వలలోకి దింపేందుకు ప్రయత్నం చేశాడు ఆ యువకుడు. అయితే ఈ క్రమంలో ఓ బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.  

 

ఫేస్‌బుక్, ట్విట్ట‌ర్ ఇక్క‌డ మోస‌పోవ‌డం కూడా చాలా తేలిక‌. ఎవ‌రిదో ఫొటో పెట్టి వాళ్ళ పేరుతో ఎకౌంట్ల‌ను మెయిన్‌టెయిన్ చేస్తూ కొన్ని అరాచ‌కాల‌కు పాల్ప‌డుతున్నారు. కొంద‌రు జులాయిలు చేసే ఈ ప‌నుల‌వ‌ల్ల అస‌లైన‌వారికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: