గౌతమ్ తిన్ననూరి  డైరెక్షన్ లో నాచురల్ స్టార్ నాని నటించిన  చిత్రం జెర్సీ.  ఎమోషనల్ స్పోర్ట్స్  డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం ఈఏడాది సమ్మర్ లో  విడుదలై తెలుగు  ప్రేక్షకుల తో పాటు  విమర్శకులను   ఫిదా చేసి  టాలీవుడ్ ఉత్తమ చిత్రాల  జాబితాలో చోటు సంపాదించింది.  ఈచిత్రంలో  అర్జున్ పాత్ర  తరువాత  అతని కొడుకు జూనియర్  నాని పాత్ర హైలైట్ అయ్యింది.  అర్జున్  పాత్రలో నాని నటించగా అతని కొడుకు పాత్రలో  మాస్టర్ రోనిత్ కమ్ర నటించాడు.  సినిమాలో వీరిద్దరిమధ్య  వచ్చే సన్నివేశాలు  ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా హిట్ అవ్వడానికి  ఇదో  ముఖ్య కారణం. 
 
 
 
ఇక ఈ కల్ట్ మూవీని  ఇప్పుడు  బాలీవుడ్ యంగ్ హీరో  షాహిద్ కపూర్ తో  హిందీలో  రీమేక్ చేస్తున్నారు.  ఇటీవలే  ఈ చిత్రం యొక్క షూటింగ్ స్టార్ట్ అయ్యింది.  ప్రస్తుతం  చండీఘర్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక   జెర్సీ లో  జూనియర్ నాని  గా నటించి మెప్పించిన  రోనిత్  కర్మనే   ఈ రీమేక్ లో కూడా ఆ పాత్రలో  అతనే నటిస్తుండడం విశేషం. ఒరిజినల్  వెర్షన్ ను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరినే  ఈ రీమేక్ ను తెరకెక్కిస్తుండగా  ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు  అల్లు అరవింద్, దిల్ రాజు..  అమన్ గిల్ తో కలిసి నిర్మిస్తున్నారు.  ఈసినిమా లో కోచ్ పాత్రలో  షాహిద్  తండ్రి పంకజ్  కపూర్ నటిస్తుండగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కనిపించనుంది.  ఈ చిత్రాన్ని ఆగస్టు 28 , 2020లో ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. ఇక  షాహిద్ కపూర్  ఇటీవల  కబీర్ సింగ్ తో  భారీ హిట్ కొట్టాడు.  బ్లాక్ బాస్టర్ తెలుగు మూవీ అర్జున్ రెడ్డి  రీమేక్ గా తెరకెక్కిన  ఈ చిత్రం  270కోట్ల వసూళ్లను రాబట్టి  ఈఏడాది హిందీ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ చిత్రంగా  రికార్డు సృష్టించింది.  దాంతో  ఈజెర్సీ రీమేక్ పై బాలీవుడ్ లో  భారీ అంచనాలు ఉన్నాయి.        

మరింత సమాచారం తెలుసుకోండి: