పూలు ఏంటి ? 40 లక్షల ఖర్చు ఏంటి అని అలోచూస్తున్నారా? మీరు విన్నది నిజమే అక్షరలా 40 లక్షలె.....త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ 'అల.. వైకుంఠపురములో' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. రెండు పాటలు ఏకంగా 100 మిలియన్ల హిట్ లు దాటాయి.

 

పాటలు శ్రోతల్ని ఉరూతలూగిస్తున్నాయి.. పాటల కోసం ఈ మధ్య బాగానే ఖర్చు చేస్తున్నారు.. పెద్ద హీరోల సినిమా పాటలు అయితే ఇంకా చెప్పవలిసిన పనిలేదు.. ఖర్చుకు వెనకాడడం లేదు. ఇప్పుడు బన్నీ సినిమా కోసం కూడా అలానే చేస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ 'అల.. వైకుంఠపురములో' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. విడుదలయిన సాంగ్స్ కి మంచిది ఆదరణ వచ్చింది.. ఆడియో అయితే సూపర్ హిట్..

 

ఇంకా వీడియో సంగతి ఇలా ఉంటుందో అని అందరి ఆసక్తి.. అందుకే ఎంత ఖర్చు అయిన లెక్క చేయకుండా భారీ సెట్టింగ్స్ లో పాటల్ని చిత్రీకరిస్తున్నారు.. అలా వైకుంఠపురం సినిమాలో రెండు పాటల చిత్రీకరణ పూర్తయింది. వీటిలో 'సామజవరగమన' పాటను విదేశాల్లో చిత్రీకరించారు. 'రాములో రాములా' పాట కోసం ఓ భారీ సెట్ వేసి.. రూ.5 కోట్ల వరకు ఖర్చు చేసి చిత్రీకరించారు.అన్ని పాటల చిత్రీకరణ అయిపోయింది కానీ 'బుట్టబొమ్మ' పాట చిత్రీకరణ మిగిలింది.

 

ఈ పాట కోసం రెండు సెట్లు వేస్తున్నారు. అన్నపూర్ణలో వేస్తున్న సెట్ లో మూడు నుండి ఐదు రోజుల పాటు చిత్రీకరణ ఉంటుంది. ఈరోజు నుండే ఆ పాటకి సంబంధించిన షూటింగ్ మొదలుకానుంది.



ఇక్కడ మరో ఇంటరెస్టింగ్ విషయమేమిటంటే.. ఈ పాట కోసం వేస్తోన్న సెట్ లో వాడేందుకు విదేశాల నుండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ప్లాంట్స్ ని తెప్పించారు. కేవలం వీతికోసమే రూ.40 లక్షలు ఖర్చు చేశారట.ఒక్క పులకే ఇంత ఖర్చు అయితే మిగతా వాటికీ ఎంత అయ్యిద్దో..



పాట పూర్తయిన తరువాత వాటిని మైంటైన్ చేయాలంటే కాస్త కష్టమే.. పోనీ వదిలించుకుందామంటే అన్ని లక్షలు ఖర్చు పెట్టి కొన్నవి ఫ్రీగా ఇవ్వలేరు. అలా అని కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారో.. రారో కూడా తెలియదు. మొత్తానికి ఒక్కో పాట కోసం చిత్రబృందం భారీగానే ఖర్చు చేస్తోంది... అల్లు అర్జున్ సినిమా అంటే అ మాత్రం ఉండాలి అంటున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: