తెలుగు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కడిగా సినీ పరిశ్రమకు వచ్చి కోట్లాది మంది ప్రేక్షకాభిమానుల ఆదరణను సంపాదించుకుని.. మూడు దశాబ్దాలుగా నెంబర్ వన్ హీరోగా.. మెగాస్టార్ గా ఎదిగిపోయాడు. ప్రపంచంలోనే ఏ హీరో కుటుంబం నుంచి రానటువంటి హీరోలు చిరంజీవి వేసిన దారిలో ఆయన వారసులుగా, మెగా హీరోలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే.. ఇటీవల మెగాస్టార్ అభిమానులు, పవర్ స్టార్ అభిమానులు, అల్లు అభిమానులుగా విడిపోయి సోషల్ మీడియాలో ఓ వార్ సృష్టించుకుంటున్నారు.

 

 

దీనిపై చిరంజీవి మేనల్లుడు సాయి తేజ్ స్పందించాడు. ప్రతిరోజు పండుగే సినిమా విజయోత్సవంలో భాగంగా రాజమండ్రిలో జరిగిన విజయోత్సవ సభలో ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘మెగా, పవర్, అల్లు.. అభిమానులు అంటూ ఎవరూ ప్రత్యేకంగా లేరు. చిరంజీవి గారి నుంచి నా వరకూ మెగా హీరోలంతా ఒకటే.. ఒక్కటిగా ఉంటేనే మనం మరింత బలంగా ఉంటాం. నన్ను ఆదరిస్తున్నది మెగా ఫ్యాన్సే’ అని అన్నాడు. సాయి తేజ్ చెప్పినదాంట్లో నిజం ఉంది. మెగా ఫ్యాన్స్ అండదండలు లేకుండా పవన్ కల్యాణ్, బన్నీతో సహా ఏ మెగా హీరో మొదటి సినిమా.. తర్వాత కెరీర్ సాగలేదు.. సాగదు.

 

 

తమ ప్రతి సినిమాకు తెగే మొదటి టికెట్ మెగాస్టార్ అభిమానిదే అని కూడా చెప్పుకుంటారు మెగా హీరోలు. సాయి తేజ్ చెప్పిన దానిపై దృష్టి పెట్టి సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ కు తెరదించాలని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఫ్యాన్స్ ముసుగులో దురభిమానులు మెగా అభిమానుల ఆత్మస్థైర్యం దెబ్బ తీసేందుకు కుట్రలు చేసే అవకాశం ఉంది. మెగా హీరోల మధ్య ఈ చిచ్చుకు కారణం రాజకీయాలే అనేది స్పష్టం. కానీ.. సినీ అభిమానంలో రాజకీయాలను కలపకుండా మెగా అభిమానులే కలిసుండాల్సిన అవసరం ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: