బాలీవుడ్ అందాలతార దీపికా పదుకొనే భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ప్రత్యేక క్రిస్మస్ చిత్రాన్ని తన సోషల్ మీడియా లో పంచుకున్నారు. డిసెంబర్ 25 బుధవారం రోజు ఈ పోస్ట్‌ను తన అభిమానులతో ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది.


ఆమె తన పోస్ట్ కు , 'మా నుండి క్రిస్మస్ శుభాకాంక్షలు! (వ్యక్తిగతీకరించిన క్రిస్మస్ చెట్టు అలంకరణ సేవలకు దీపికా & కోను సంప్రదించండి)! అంటూ కాప్షన్ రాసింది.'


అయితే ప్రస్తుతం ఈ జంట ఫొటో చాలా రొమాంటిక్ గా ఉందని, ఇంకా వీళ్లిద్దరి ప్రేమ కనుల విందుగా ఉందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఫొటోలో ఆలూమగలైనా రణవీర్ సింగ్, దీపికా గట్టిగ హత్తుకొని ఒకరినొకరు చూసుకుంటూ అలానే ఉండిపోయారు. వారిద్దరూ కూడా ఎరుపు రంగు వస్రాలనే ధరించి ఉన్నారు. దీపిక రెడ్ స్వెటర్‌లో ఉండగా, రణ్‌వీర్ రెడ్ ట్రాక్ సూట్ ధరించి ఉన్నాడు. దీపిక తన సోదరి అనిషా పదుకొనే, మరియు ఆమె స్నేహితులు స్నేహ రామచందర్, దివ్య నారాయణ్, మాల్విక నాయక్,  నిఖిల్ సోసలేలను కూడా ట్యాగ్ చేశారు.



రణ్‌వీర్ మరో చిత్రాన్ని పోస్ట్ చేసి, 'నాకు క్రిస్మస్ కోసం దీపికా కావాలి...' అనే క్యాప్షన్‌లో రాశారు. దీపికా పోస్ట్‌కు కేవలం 10 నిమిషాల్లోపు దాదాపు 200,000 ‘లైక్‌లు’ వచ్చాయి. వారిద్దరి ఫోటోను చూసి అభిమానులతో సహా బాలీవుడ్ నటులు కూడా ఫిదా అయ్యిపోయారు. బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫోటో కి స్పందిస్తూ కామెంట్ బాక్స్ లో హార్ట్ ఎమోజిని రిప్లయ్ గా ఇచ్చింది. మరికొందరు ఈ క్యూట్ జంటకు మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ జంట ఇటీవల వారి కుటుంబ సభ్యులతో కలిసి నవంబర్లో వారి మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. మొదటి వివాహ వార్షికోత్సవ సందర్బంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని, స్వామి వారి ఆశీస్సులను పొందారు.


ఆమె తన సినీ జీవితాన్ని, ఆమె కుటుంబాన్ని ఎలా ఇబ్బందులు లేకుండా కొనసాగిస్తుందోనని దీపికాని ఒక ఇంటర్వ్యూ లో ప్రశ్నించినప్పుడు, ఆమె ఇలా అన్నారు, 'ఇక్కడ చాలా మంది వివాహిత జంటలు ఉన్నారు, అందరూ నా లాగానే బిజీగా ఉన్నారు. మా జీవితాలు వేరొకరి నుండి చాలా భిన్నంగా ఉన్నాయని నేను అనుకోను. మేము ఒకరినొకరు ఎంతో గౌరవించుకుంటాం. అలాగే మా కెరీర్లు మాకు చాలా ముఖ్యమైనవి అనే వాస్తవాన్ని గౌరవించుకోవడం వలనే మా వివాహబంధం సాఫీగా సాగిపోతుంది.'అని సమాధానమిచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: