రజినీకాంత్ సినిమాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలకు కోట్లాది మంది అభిమానులు ఉన్నమాట వాస్తవం.  ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీస్తున్నారు.  ఈ సినిమాల కోసం యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నది.  ఇప్పటి వరకు రజినీకాంత్ 167 సినిమాల్లో నటించారు.  దర్బార్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్నది.  ఇందులో రజినీకాంత్ బ్యాడ్ పోలీస్ గా నటిస్తున్నారు.  రజిని తన మ్యానరిజంతో ఆకట్టుకోబోతున్నాడు.  రజిని సినిమాలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్క ప్రశ్న వేదిస్తున్నది.  


గత కొంతకాలంగా రజినీకాంత్ సినిమాలు ఎందుకు బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి అనే డౌట్ వస్తోంది.  నరసింహా, అరుణాచలం, ముత్తు, బాషా, చంద్రముఖి ఇలా ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీశారు.  రోబో వంటి సైంటిఫిక్ సినిమా తీశారు.  అయితే, గత నాలుగేళ్లలో రజినీకి సరైన హిట్ లేదు.  రజిని మార్క్ హిట్ కోసం ఎందుకు అయన సినిమాలు చేయడం లేదో తెలియడం లేదు.  


ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలు చేయడంతో రజిని ఇబ్బందులు పడుతున్నారు.  ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అయన చేస్తున్న కృషి అంతాఇంతా కాదు.  ఎంతగా ప్రయత్నం చేసినా ఆ మార్క్ అందుకోలేకపోతున్నారు.  ప్రస్తుతం అయన చేస్తున్న సినిమా దర్బార్.  ఈ సినిమాపై అంచనాలు ఉన్నా దానికి తగినట్టుగా ప్రమోషన్స్ స్టార్ట్ కాలేదు.  రజిని సినిమా వస్తుంది అంటే తమిళనాడులో సందడి ఉంటుంది.  


జనవరి 9, 2020 లో ఈ సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  ఈ సమయంలో సినిమాకు టాక్ రావాల్సి ఉన్నది.  కానీ, ఆ బజ్ కనిపించడం లేదు.  అయితే, జనవరి 1 నుంచి సినిమాను ప్రమోట్ చేసే అవకాశం కనిపిస్తోంది.  తెలుగులో సినిమాను దిల్ రాజు తీసుకున్నారు కాబట్టి సినిమాను ప్రమోట్ చెయ్యొచ్చు.  పైగా 25 ఏళ్ల తరువాత ఆదిత్య అరుణాచలంగా ఈ దర్బార్ లో కనిపిస్తున్నారు.  కొన్ని రకాల సెంటిమెంట్ లు కూడా రజినీకాంత్ ప్లాన్ చేసుకుంటున్నారు.  ఇప్పటికే రజిని 168 కూడా ప్రారంభం అయ్యింది.  శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: