తెలుగు సినిమాల్లో నెగెటివ్ రోల్స్ చేయించడానికి ఎక్కువ పరభాషా నటులకే అవకాశం ఇస్తారు. కొద్దిగా బలంగా ఉండి, నటన రాకపోయినా సరే వాళ్ళకోసం అడిగి మరీ ఇక్కడికి రప్పించి సినిమాల్లో నటింపజేస్తుంటారు. తెలుగు వారిలో బలమైన నటులే లేరన్న భావన ప్రేక్షకులకి కలిగిస్తారు. నెగెటివ్ రోల్ అనగానే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. సినిమా హీరోయిన్లనే కాదు, ఇలా విలన్ వేషాలు కూడా పరభాషా నటులకే ఎక్కువ అవకాశం వస్తుంటుంది.

 

 

అయితే తెలుగులోఅలాంటి వాళ్ళు లేక కాదు. ఉన్నవాళ్ళని సరిగ్గా ఉపయోగించుకోవడం రాక అనే చెప్పాలి. బలమైన ఆహార్యం ఉండి, మంచి నటన కనబర్చే నటులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో శత్రు కూడా ఒకరు. క్రిష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఈ నటుడికి చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేవు. నటన పరంగానూ, ఆహార్యంలోనూ తీసిపోని ఈ నటుడిని సుకుమార్, బన్నీ తో తీసే సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.

 

 

ఇంతకుముందు సుకుమార్ తీసిన రంగస్థలం సినిమాలోనూ శత్రు కనిపించాడు. ప్రస్తుతం సుక్కూ బన్నీ సినిమాలో ఒక కీలకమైన పాత్ర దక్కించుకున్నాడట.  ఐతే ఇందులో అతను చేస్తున్నది నెగెటివ్ రోల్ కాదట. ఈ సినిమాలో శత్రు పోలీస్ పాత్ర చేస్తున్నాడని.. అది పాజిటివ్‌గానే ఉంటుందని.. ఇటీవల కేరళలో జరిగిన తొలి షెడ్యూల్లో శత్రు మీదే కొన్ని ముఖ్య సన్నివేశాలు చిత్రీకరించారని.. సినిమాలో అతడి పాత్ర భలేగా ఎలివేట్ అవుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

 

 


మరి ఈ సినిమా ద్వారానైనా శత్రు కెరీర్ మలుపు తిరుగుతుందేమో చూడాలి. తెలుగులో నెగెటివ్ రోల్స్ వేయడానికి నటులే లేరనుకునే వాళ్లకి శత్రు ఒక దారి చూపిస్తాడేమో చూడాలి.  ఈ విధంగానైనా తెలుగు వాళ్ళకి అవకాశాలు వస్తే అంతకు మించి కావాల్సిందేం ఉంటుంది ఎవరికైనా

మరింత సమాచారం తెలుసుకోండి: