‘సరిలేరు నీకెవ్వరు’ మూవీకి సంబంధించిన పాటలు ఊహించిన స్థాయిలో యూత్ కు కనెక్ట్ అవ్వకపోవడంతో ఈ మూవీ బయ్యర్లు విపరీతంగా టెన్షన్ పడుతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ మూవీని అత్యంత భారీ మొత్తానికి కొనుక్కున్న ఓవర్సీస్ బయ్యర్ ఈ మూవీలోని పాటలను ప్రమోట్ చేయడానికి ఏకంగా రోజుకు 20 టిక్కెట్లు చొప్పున 17 జనవరి వరకు ఫ్రీ ఆఫర్ ప్రకటించారు అంటే ఈ మూవీ కలక్షన్స్ గురించి బయ్యర్లు ఏస్థాయిలో భయపడుతున్నారో అర్ధం అవుతుంది.

అమెరికాలోని లోకల్ రేడియోలలో బాగా పాపులర్ అయిన ‘మన రేడియో’ ఇంటర్నెట్ రేడియోను ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్ కోసం ‘సరిలేరు నీకెవ్వరు’ రేడియో స్టేషన్ గా మార్చి వేసి ఈ సినిమాకు సంబంధించిన పాటలతో పాటు ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన విశేషాలు ఈ మూవీలో నటించిన నటీనటుల ఇంటర్వ్యూలు ఈ లోకల్ రేడియో కార్యక్రమాలను నింపేస్తున్నారు.

ప్రతిరోజు ప్రసారం అయ్యే ఈ కార్యక్రమాల పై శ్రోతలకు రకరకాల ప్రశ్నలు ఈ మూవీ పై అడుగుతూ సరైన సమాధానాలు చెప్పిన వారికి ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీకి సంబంధించిన ప్రీ టిక్కెట్స్ ను రోజుకు 20 చొప్పున ఇవ్వబోతున్నట్లు ప్రకటన చేసారు. దీనితో ‘సరిలేరు నీకెవ్వరు’ పాటలు కార్యక్రమాలతో అమెరికాలోని ‘మన రేడియో’ హోరేత్తబోతోంది. 

అయితే ఇలాంటి ఫ్రీ టిక్కెట్స్ ఆఫర్లు ఇచ్చి ఈ మధ్య విడుదలైన రెండు చిన్న సినిమాలు ఘోరంగా ప్లాప్ అయ్యాయి. సందీప్ కిషన్ నటించిన ‘తెనాలి రామకృష్ణ’ లేటెస్ట్ గా విడుదలైన రాజ్ తరుణ్ ‘ఇద్దరి లోకం ఒకటీ మూవీలకు విడుదలకు ముందు హైక్ క్రియేట్ చేయడానికి ఇలా కొన్ని చోట్ల విడుదలకు ముందు ఫ్రీ షోలు వేసి ఈ మూవీలను జనంలోకి తీసుకు వెళ్ళడానికి ప్రయత్నించారు. అయినా ఈ రెండు సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. దీనితో ఇలాంటి ఫెయిల్యూర్ టెక్నిక్ ను ‘సరిలేరు నీకెవ్వరు’ ఓవర్సీస్ బయ్యరు ఎందుకు అనుసరిస్తున్నాడు అంటూ చాలామంది షాక్ అవుతున్నారు..      

 

మరింత సమాచారం తెలుసుకోండి: