ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ గురించి తెలియని వాళ్ళుండరు. ఈ షో స్టార్ట్ అయ్యి ఎన్నో ఏళ్ళు కావొస్తున్నా ఇప్పటికీ టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతుంది. రాత్రి తొమ్మిది గంటల ముఫ్పై నిమిషాలకి ప్రసారమయ్యే ఈ షోకి వీక్షకులు చాలా ఎక్కువ. అంతే కాదు యూట్యూబ్ లోనూ ఈ షోకి ఆదరణ ఎక్కువే. జబర్దస్త ద్వారా వచ్చిన చాలా మంది కమెడియన్స్ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. 

 

 

ఇప్పటికే చాలామంది నటులకి సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. అయితే ఇదిలా ఉంటే జబర్దస్త్ నటుడికి బాలీవుడ్ ఆఫర్ రావడం నిజంగా ఆశ్చర్యమే. అవును మీరు విన్నది నిజమే. జబర్దస్త్ లో లేడీ గెటప్ లు వేస్తూ ఫేమస్ అయిన వినోద్ కి బాలీవుడ్ ఆఫర్ వచ్చిందట. గత కొంత కాలంగా అనవసర వివాదాల్లో ఇరుక్కుని ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్న వినోద్ ఇప్పుడు మళ్లీ జబర్దస్త్ లో కనిపిస్తున్నాడు. 

 

 ఇంటి ఓనర్ ఈయనపై దాడి చేయడం.. ఆ తర్వాత కేసులు అలా కొంతకాలం పాటు జబర్దస్త్‌కు దూరమయ్యాడు వినోద్. ఇలా ఈ మధ్య చాలా వరకు వివాదాల్లోనే ఉంటున్న వినోద్.. ఈ మధ్యే మళ్లీ షోకు వచ్చాడు. అయితే వినోద్ బాలీవుడ్ లో ఒక సినిమాలో నటిస్తున్నాననే విషయం తానే స్వయంగా చెప్పాడు. సెన్సేషనల్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే సినిమాలో వినోద్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 

 

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఆల్రెడీ  ఓ షెడ్యూల్ వెళ్లొచ్చిన వినోద్.. తాజాగా మరో షెడ్యూల్ కోసం ముంబై వెళ్లాడు. మరి ఈ సినిమాతో వినోద్ కెరీర్ మలుపు తిరుగుతుందేమో చూడాలి. ఈ సినిమాలో వినోద్ చేస్తున్నాడంటే అది కామెడీ క్యారెక్టరా లేక సినిమాలో కూడా లేడీ గెటప్పేనా అనే అనుమానం వస్తుంది. ఈ విషయాల్ని వినోద్ వెల్లడించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: