టాలీవుడ్ లో ఈ మద్య కొత్త హీరోయిన్ల జోరు పెరిగింది.  త్రిష,నయనతార,అనుష్క, కాజల్ లాంటి హీరోయిన్ల తర్వాత రకూల్, రాశీఖన్నా,రెజీనా మరికొంత మంది హీరోయిన్లు తమ అందాలతో కనువిందు చేశారు.  అయితే రకూల్ ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతుంది.  ఇక రెజీనా అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తుంది. రాశీఖన్నా అదృష్టం కోసం పరుగులు తీస్తుంది.  ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడికి ఈ ఏడాది బాగానే కలిసి వచ్చింది. 2013లో విడుదలైన హిందీ మూవీ "మద్రాస్ కెఫె"లో భారత ఇంటలిజెంస్ అధికారి విక్రం సింగ్ భార్య రూబి సింగ్ పాత్ర ద్వారా సినీరంగంలోకి వచ్చింది. ఆ తర్వాత తెలుగులో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగశౌర్య నటించిన  ఊహలు గుసగుసలాడే మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది రాశీఖన్నా.

 

ఆ తర్వాత జోరు, జిల్, బెంగాల్ టైగర్ లాంటి మూవీస్ లో నటించినా పెద్దగా  కలిసి రాలేదు. తర్వాత సాయిధరమ్ తేజ్ తో సుప్రీమ్ మూవీతో మంచి విజయం అందుకుంది.  ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన జై లవకుశ తో మరో విజయం అందుకుంది.  ఈ రెండు మూవీస్ మంచి విజయాలు అందుకున్నా స్టార్ హీరోయిన్ మాత్రం కాలేక పోయింది.  కాకపోతే  తెలుగు, తమిళంలో రాశీఖన్నాకు మంచి ఛాన్సులు వచ్చాయి. ఇక ఈ ఏడాది రాశీఖన్నా అదృష్టం మంచి రన్నింగ్ లో ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు.  వెంకిమామతో  హిట్ కొట్టిన రాశి ఖన్నా ప్రతి రోజు పండుగే సినిమాతో మరో  బంపర్ హిట్ కొట్టింది.

 

ప్రతి రోజు పండగే సినిమా కలెక్షన్స్ పరంగా థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఫస్ట్ హాఫ్ లో రాశి ఖన ఏంజిల్ ఆర్నా పాత్ర బాగానే హైలెట్ అయ్యింది.. కానీ సెకండ్ హాఫ్ లో మారుతీ రాశి పాత్ర తగ్గించిన ఈ అమ్మడి కామెడీ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాలో క్యూట్ అండ్ గ్లామర్ ఎక్సప్రెషన్స్ కి స్టార్ హీరోల చూపు ఈ అమ్మడి వైపు తప్పకుండా తిరిగి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ ఏడాది రాశీఖన్నా లక్కీ హీరోయిన్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: