కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు గీతా గోవిందంతో సెన్సేషనల్ హిట్ అందుకుంది. ప్రస్తుతం మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్న రష్మిక ఆ తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ సినిమాలో కూడా నటిస్తుందని తెలుస్తుంది. తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తున్న రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టితో మ్యారేజ్ క్యాన్సిల్ అవడానికి గల కారణాలు చెప్పింది.

 

అసలైతే తనకు సినిమా పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తిని పెళ్లాడాలని ఉండేదని కాని రక్షిత్ శెట్టితో వర్క్ చేశాక తన మనసుకి దగ్గరయ్యాడని అందుకే అతనితో ఎంగేజ్ మెంట్ దాకా వెళ్లామని.. అయితే తన ఎంగేజ్ మెంట్ తర్వాత ప్రస్తుతం ఉన్న సినిమాలు పూర్తి చేసేదాకా పెళ్లి వాయిదా వేసుకున్నాం. రెండేళ్ల వరకు పెళ్లి వాయిదా వేయడంతో ఇంకా సినిమా ఆఫర్లు వచ్చాయి.

 

కెరియర్ మీద దృష్టి పెట్టే ఉద్దేశంతోనే రక్షిత్ తో పెళ్లి క్యాన్సిల్ చేసినట్టుగా చెబుతుంది రష్మిక. అయితే తెలుగులో విజయ్ దేవరకొండతో రష్మిక క్లోజ్ నెస్ వల్ల వాళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే రూమర్స్ మొదలయ్యాయి. రష్మిక రక్షిత్ శెట్టితో పెళ్లి క్యాన్సిల్ చేయడానికి విజయ్ దేవరకొండ ఒక రీజన్ అని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అసలు ఈ మ్యాటర్ తో విజయ్ కు సంబంధం లేదని తెలుస్తుంది.

 

అయితే రష్మికకు విజయ్ మంచి ఫ్రెండ్ గా మారాడు. గీతా గోవిందంతో వాళ్లిద్దరిది హిట్ పెయిర్ కాగా డియర్ కామ్రేడ్ లో కూడా కలిసి నటించారు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. విజయ్, రష్మిక కెరియర్ ఫుల్ జోష్ లో కొనసాగిస్తున్నారు. రక్షిత్ శెట్టి కూడా తెలుగులో ఎంట్రీ ఇస్తున్నాడు. అతను చేసిన అతడే శ్రీమన్నారాయణ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవనుంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ తెలుగు ఆడియెన్స్ కు నచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: