కోలీవుడ్ క్రేజీ బ్యూటీ ఆండ్రియా జెరెమియా అందం అభినయం రెండు ఉన్నా సరే అమ్మడికి అదృష్టం కలిసి రాలేదని చెప్పాలి. కెరియర్ లో అప్పుడప్పుడే ఎదుగుతున్న టైం లో పెళ్లైన వ్యక్తితో సహజీవనం చేసి తన కెరియర్ పాడు చేసుకున్న ఆండ్రియా తను మానసికంగా.. శారీరకంగా చాలా బాధపడ్డానని ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. సింగర్ గా కెరియర్ మొదలు పెట్టి తన చార్మింగ్ బ్యూటీనెస్ తో హీరోయిన్ గా మారిన ఆండ్రియా తమిళంలో అడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తుంది.

 

ఇక వీలు కుదిరినప్పుడల్లా తన సింగింగ్ టాలెంట్ చూపించే ఆండ్రియా లేటెస్ట్ గా ఓ ఈవెంట్ లో తన ఆట పాటలతో అలరించింది. అంతా బాగానే ఉంది కాని ఆండ్రియా వేసుకున్న డ్రెస్ మీద నెగటివ్ ట్రోల్స్ వస్తున్నాయి. ఇవి ఎక్కువవడం వల్ల ఆండ్రియా కూడా నెటిజెన్లకు గట్టి రిప్లై ఇచ్చింది. తను పాడే పాట మీద దృష్టి కాకుండా మీరు నా కాస్టూం ఎలా ఉంది అన్నది ఎందుకు చూస్తున్నారని అన్నదు.

 

మీరు చూడాల్సింది అక్కడ కాదు తన సింగింగ్ టాలెంట్ అంటూ చురకలేసింది. తనకు ఇష్టం వచ్చినట్టు ఉండే స్వతంత్రం తనకు ఉందని అందుకే ఎవరో ఏదో చెబితే వినే టైప్ కాదని అన్నది ఆండ్రియా. తన కాస్టూం మీద ఉన్న దృష్టి తను పాడే పాట మీద లేదని అన్నది. ప్రస్తుతం ఆండ్రియా ఆ ఈవెంట్ లో పాడిన సాంగ్ ఆ కాస్టూం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

తెలుగులో కూడా ఆండ్రియా రెండు మూడు సినిమాలు చేసింది. అందం అభినయం ఉన్నా సరే ఆండ్రియాకు లక్ కలిసి రాలేదని చెప్పాలి. కెరియర్ లో వెనక పడ్డా మళ్లీ నూతన ఉత్సాహంతో ఆమె సినిమాలు చేస్తుంది. యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆండ్రియాకు ఒక మోస్తారు ఇమేజ్ ఏర్పరచుకుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Va va pakkam va 😋 #aboutlastnight #birthdaygirl #thejeremiahproject Thanks @amritha.ram for this BOMB 👗 ❤️

A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) on

మరింత సమాచారం తెలుసుకోండి: