ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం రూలర్‌. తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబ‌ర్ 20న‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా నటించారు. బాలయ్యతో ‘జై సింహా’ వంటి మంచి హిట్ అందించిన కే.యస్.రవికుమార్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కానీ..  ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తాపడింది. 

 

రొటీన్ కథే అయినప్పటికీ స్క్రీన్ ప్లే లో కొత్తదనం చూపించలేకపోయాడు దర్శకుడు. ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ ని ద్రుష్టిలో పెట్టుకొని కథ, కథనాలు రాసుకున్నట్టుగా కనిపిస్తుంది. దీంతో ప్రేక్ష‌కుల‌ను ఏ మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. రూలర్‌కు తొలి షో నుంచే డిజాస్టర్ టాక్‌ రావటంతో కలెక్షన్లు కూడా దారుణంగా ఉన్నాయి. దీనికి తోడు రూలర్‌తో పాటు రిలీజ్ అయిన ప్రతిరోజూ పండగే సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావటంతో ఆ ప్రభావం కూడా రూలర్‌ కలెక్షన్లపై పడింది. 

 

మొదటి రోజు మాస్ క్రేజ్ తో డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ రెండవ రోజు నుంచి కంప్లీట్ డ్రాప్ అయ్యింది. స్టార్ హీరో సినిమా కాబట్టి క్రిస్మస్ హాలిడే కొంత హెల్ప్ అవుతుంది అనుకున్నారు కానీ క్రిస్మస్ కూడా మైనస్సే అయ్యింది. కేవలం 40 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ఆంధ్ర – తెలంగాణాలో 21.5 కోట్లకి అమ్ముడు పోయిన ‘రూలర్’ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కి సుమారు 13 కోట్ల భారీగా నష్టాన్ని చవి చూడనున్నారని స‌మాచారం.

 

‘రూలర్’ 6 డేస్ ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్స్:

 

నైజాం- 1.66 కోట్లు

 

సీడెడ్- 1.95 కోట్లు

 

గుంటూరు- 1.55 కోట్లు

 

ఉత్తరాంధ్ర- 72 లక్షలు

 

తూర్పు గోదావరి- 48.5 లక్షలు

 

పశ్చిమ గోదావరి- 40.5 లక్షలు

 

కృష్ణా- 40 లక్షలు

 

నెల్లూరు- 35 లక్షలు
----------------------------------------------
6 డేస్ మొత్తం షేర్- 7.52 కోట్లు
-----------------------------------------------

 

కర్ణాటక + ఇండియా- 1.10 కోట్లు

 

ఓవర్సీస్- 0.54 కోట్లు
------------------------------------------------
వరల్డ్ వైడ్ 6 డేస్ కలెక్షన్స్- 9.16 కోట్లు
-------------------------------------------------

 

మరింత సమాచారం తెలుసుకోండి: