బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్లాప్ సినిమాలతో అత్యధిక వసూలు రాబట్టిన హీరో అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ తో పాటు కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా తాజాగా వసూలు రాబట్టాడు. భారీ అంచనాల మధ్య ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ 3 బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ముఖ్యంగా ప్రభుదేవా దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో ఖచ్చితంగా సల్మాన్ ఖాన్ మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం గ్యారెంటీ అని గతంలో దబాంగ్ పేరిట వచ్చిన రెండు సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు సల్మాన్ ఖాన్ కెరియర్లోనే మైలురాళ్ళు సినిమాలుగా హిస్టరీ క్రియేట్ చేయడం తో దబాంగ్ 3 సినిమా విడుదల కాకముందే బాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ మరియు సల్మాన్ ఖాన్ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకోవడం జరిగింది.

 

తీరా సినిమా రిలీజయ్యాక ఇంత దారుణమైన బోర్ కొట్టిన సినిమా సల్మాన్ కెరీర్లోనే మరొకటి లేదని దరిద్రమైన సినిమా అని అస్సలు బాగోలేదు సినిమా కి వెళ్లొద్దు వామ్మో అని దబాంగ్ 3 సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా హాల్ దగ్గర కామెంట్ చేశారు. ఇటువంటి టాక్ తో మొదలైన దబాంగ్ త్రీ కలెక్షన్లు 100 కోట్ల నెట్‌ను తాకింది. అక్షయ్ కుమార్ యొక్క గుడ్ న్యూవ్జ్ మినహా ఇతర పెద్ద విషయాలు ఏవీ లేనందున, ఖచ్చితంగా సల్మాన్ ఆ మాస్ సెంటర్లకు క్యాటరింగ్ చేస్తాడు మరియు 20-30 కోట్లను మరింత సులభంగా సంపాదించగలడని క్రెడిట్ వర్గాలకు చెందిన వారు అంటున్నారు.

 

ఇంత దారుణమైన డిజాస్టర్ సినిమాకి ఈ విధమైన కలెక్షన్లు రావడం అంటే అది ఖచ్చితంగా సల్మాన్ ఖాన్ యొక్క క్రేజ్ అని అంటున్నారు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు. మరికొద్ది రోజుల్లో మరింతగా ఈ సినిమా కలెక్షన్లు సాధించడం గ్యారెంటీ అని సినిమాకి మైనస్ విలన్ సుదీప్ మరియు అదే విధంగా కొత్త హీరోయిన్ సాయియే మంజ్రేకర్ అని అంతేకాకుండా డైరెక్షన్ విషయంలో ప్రభుదేవా చాలా మిస్టేక్స్ చేయటం సినిమాలో చాలా సందర్భాలలో తెలుస్తుంది అని అందువల్ల సినిమా ఫ్లాప్ అయ్యింది అని సినిమా చూసిన వాళ్లు కామెంట్ చేస్తున్నారు. ఏదిఏమైనా ఫ్లాప్ అయినా.. దరిద్రమైన సినిమాకి ఈ విధమైన కలెక్షన్లు రావడం కేవలం సల్మాన్ యొక్క క్రేజ్ కి నిదర్శనం అని ట్రేడ్ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: