జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే. ఆ స్నేహం కారణంగా వీళ్లిద్దరు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తే.. తారక్. కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులు కలిస్తే ఎలా ఉంటుందనే కథతో జక్కన్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది జూలై 30న  విడుదల చేయనున్నారు. 

 


ఎన్టీఆర్ అంటే ఇష్టపడని వారు ఉండరు. అభిమానులు నుంచి ఇటు సినిమా ఇండ‌స్ట్రీలో కూడా చాలా మంది ఎన్టీఆర్ అంటే ఇష్ట‌ప‌డ‌తారు. నందమూరి వంశం నుండి ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఎన్టీఆర్..కెరియర్ మొదట్లోనే మాస్ ఆడియన్స్ ను తన వైపు తిప్పుకొని సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్ లో ఉన్న ఈయన రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. కాగా ఎన్టీఆర్ పై సీనియర్ నటి ముద్దుల వర్షం కురిపించడం అభిమానులను సంతోషానికి గురి చేసింది.

 

సీనియర్ హీరోయిన్ కుష్భూ తనకు ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.ఈటీవీ లో ప్రసారం అయ్యే 'ఆలీతో సరదాగా' అనే ప్రోగ్రామ్‌కు గెస్ట్‌గా వచ్చిన ఖుష్బూ తెలుగులో తనకు ఇష్టమైన హీరో జూనియర్ ఎన్టీఆర్ అని ఆ ఫొటో చూడగానే ముద్దుల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాలోని యంగ్ యమ పాటకు కేకలు వేస్తూ డ్యాన్స్ చేసింది. తమిళంలో అరవింద స్వామి, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో ఇష్టం అని వెల్లడించింది కుష్భు. ఇలా ఎన్టీఆర్ ఇటు మాములు ప్రేక్ష‌కుల‌నే కాకుండా... సెలెబ్రెటీల‌ను కూడా అభిమానులు  చేసేసుకున్నాడు. ఇక రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో ఎవ‌రికి వారు త‌మ స‌త్తా ఏంటో ప్రేక్ష‌కుల‌కు చూపించ‌డానికి సిద్ధ‌మ‌యిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: