మరొక నాలుగు రోజుల్లో 2019 సంవత్సరం ముగియబోతోంది. ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా భారీగానే టాలీవుడ్ సినిమాలు రిలీజ్ అవడం, వాటిలో కొన్ని మాత్రమే సక్సెస్ అవడం జరిగింది. ఇక ఈ ఏడాది రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించడంతో పాటు, ఆ తరువాత బుల్లితెరపై భారీ స్థాయిలో రేటింగ్స్ సాధించిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా జనవరిలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్2 సినిమా సూపర్ హిట్ కొట్టడంతో పాటు బుల్లితెరపై ఏకంగా 17.2 టీఆర్పీ రేటింగ్స్ తో అత్యధిక రేటింగ్స్ సంపాదించిన సినిమాగా రికార్డుకెక్కింది. ఆ తరువాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా, కెరీర్ పరంగా అటు రామ్ కు, 

 

ఇటు పూరి కి పెద్ద బ్రేక్ నివ్వడంతో పాటు బుల్లితెరపై 16.63 రేటింగ్స్ తో రెండవ స్థానంలో నిలిచింది. ఆ తరువాత రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన కాంచన 3 సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టి బుల్లితెరపై 13.10 రేటింగ్స్ తో మూడవ స్థానములో నిలిచింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రాక్షసుడు 10.1 రేటింగ్స్ తో నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి ల కలయికలో తెరకెక్కిన మహేష్ బాబు 25వ సినిమా మహర్షి, ఈ ఏడాది అతి పెద్ద విజయాన్ని అందుకున్న సినిమాగా నిలవడంతో పాటు బుల్లితెరపై 9.3 రేటింగ్స్ తో ఐదవ స్థానములో నిలిచింది. అక్కినేని సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన డిఫరెంట్ మూవీ ఓ బేబీ, 9 రేటింగ్ తో ఆరవ స్థానంలోనూ, 

 

అలానే నాని మరియు శ్రద్ధ శ్రీనాధ్ ల కలయికలో తెరకెక్కిన జెర్సీ సినిమా 8.8 రేటింగ్స్ తో ఏడవ స్థానం, అక్కినేని నాగచైతన్య, సమంతల కలయికలో తెరకెక్కిన మజిలీ సినిమా 7.9 రేటింగ్స్ తో ఎనిమిదవ స్థానం, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమా 7.8 రేటింగ్స్ తో తొమ్మిదవ స్థానం,  అలానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ ల కలయికలో తెరకెక్కిన సీత సినిమా 7.5 రేటింగ్స్ తో పదవ స్థానంలోనూ నిలిచాయి. అయితే మెగాస్టార్ నటించిన సైరా సినిమా ఇప్పటివరకు తెలుగులో ప్రసారం కానప్పటికీ, ఇటీవల ఒక తమిళ ఛానల్ లో ప్రసారం అయి 15.3 రేటింగ్స్ దక్కించుకోవడం విశేషం....!!

మరింత సమాచారం తెలుసుకోండి: