రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్.. బుల్లి తెర ప్రేమికులు. తెర వెనుక ఎలా ఉంటారో తెలీదు కానీ తెర ముందుకు వచ్చారంటే మాత్రం ప్రపంచంలో తమలాంటి లవర్స్ ఇంకెవరూ లేరన్నట్లు బిల్డప్ ఇస్తుంటారు.  వీరిద్దరూ కల్సి జబర్దస్త్ లో కనిపించినా.. ఢీ షోలో మెరిసినా.. వారి మధ్య నడిచే ట్రాక్ కి వుండే రేటింగ్ సపరేట్. అయితే వీటిపై ఈ ఇద్దరూ పలు సందర్భాల్లో స్పందిస్తూ అలాంటిదేం లేదని కుండబద్దలు కొట్టేసినా.. చాలా యూట్యూబ్ ఛానల్స్‌ ఈ ఇద్దర్నీ జత కలుపుతూ పెళ్లి వరకూ తీసుకువెళ్తూనే ఉన్నాయి.   ప్రతిసారి ఆన్ స్క్రీన్‌పై సుధీర్, రష్మిలు రొమాన్స్ పండిస్తూ రూమర్స్‌కి బలాన్ని చేకూర్చుతున్నారు.

 

ఇదిలా ఉంటే.. జబర్దస్త్‌, ఢీ, పోవే పోరా వంటి సూపర్‌హిట్‌ టెలివిజన్‌ షోస్‌ ద్వారా ఎంతో పాపులర్‌ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా, ‘రాజుగారి గది’ ఫేమ్‌ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా న‌టిస్తున్న చిత్రం `సాఫ్ట్‌వేర్ సుధీర్`. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా తెలుగు ప్రజలముందుకు రాబోతున్నాడు. శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై పారిశ్రామికవేత్త కె. శేఖర్‌ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 28న విడుదల కానుంది ఈ చిత్రం నాజర్, ఇంద్రజ లాంటి సీనియర్ యాక్టర్స్ కూడా నటించారు. 

 

ఇక‌ సాఫ్ట్‌వేర్ సుధీర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. తెలుగులో టాప్ యాంకర్స్‌గా ఉన్న రవి, ప్రదీప్, సుమతో పాటు జబర్దస్త్ కమెడియన్స్ రాంప్రసాద్, గెటప్ శ్రీను, రాకెట్ రాఘవ, ముక్కు అవినాష్ ఇలా చాలా మంది జబర్దస్త్ కమెడియన్స్ వచ్చారు. కానీ సుధీర్‌కు అత్యంత ప్రియ‌మైన స్నేహితురాలు రష్మీ గౌత‌మ్‌ మాత్రం రాకుండా షాక్ ఇచ్చింది. మ‌రోవైపు సాఫ్ట్‌వేర్ సుధీర్ ఫస్ట్ లుక్ నుంచి అన్నింటికి నాగబాబు వచ్చాడు. కానీ ఆయన జబర్దస్త్ నుంచి బయటికి వచ్చిన తర్వాత జరిగిన తొలి వేడుకకు మాత్రం నాగబాబు రాలేదు. కాగా, మొద‌టి సారి హీరోగా ప‌రిచ‌యం అవుతున్న సుధీర్ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాడో చూడాలి.
 

 


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: