టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి తర్వాత కోలీవుడ్ లో సంచలన విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.  కమల్ హాసన్ తర్వాత ఆ తరహా ప్రయోగాత్మక పాత్రల్లో నటించారు చియాన్ విక్రమ్. తమిళంలో మంచి మార్కెట్‌ను తెచ్చుకోవడం మాత్రమే కాదు చియాన్ అనే బిరుదును సొంతం చేసుకున్నారు.  విలక్షణమైన సినిమాలతో కమర్షియల్ హిట్లు సాధిస్తూ, కోలీవుడ్ లో కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయి ప్రయోగాలు చేసే హీరో చియాన్ విక్రం. ఈ ఏడాది ఆయన నటించిన “కాదరన్ కొండేన్” సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి ప్రేక్షకులను నిరాశ పరిచింది. తెలుగులో ‘శివపుత్రుడు’ సినిమాతో అందరినీ ఆకర్షించారు. తర్వాత ‘అపరిచితుడు’ మూవీతో తెలుగులో స్టార్‌డమ్‌ సంపాదించుకున్నాడు.  తాజాగా అజయ్ జ్ఞానముత్తు  దర్శకత్వంలో వస్తున్న విక్రమ్‌ 58వ సినిమాకు ‘కోబ్రా’ అని టైటిల్‌ ఖరారు చేశారు.  

 

గత ఏడాది వచ్చిన ‘స్కెచ్’, ‘సామీ 2’ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే, ఈసారి మాత్రం ఒక వెరైటీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు విక్రమ్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ తన 58వ సినిమాను చేస్తున్నారు.  ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. అంతే కాదు ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక బంగారపు నిధి, దానిపైన కిరీటం దానికి చుట్టుకుంటూ బుసలు కొడుతూ ఉన్న రెండు తలల త్రాచుపాము ని ఇందులో చూపించారు .

 

ఈ మొత్తం సీక్వెన్స్ కి ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్ .రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే అభిమానులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటోంది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది.  వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: