గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ స్టాటస్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన ప్రియాంక బాలీవుడ్ లో ఒక వెలుగు వెలుగుతూన్నప్పుడే హాలీవుడ్ లో నటించే అవకాశం దక్కించుకుంది. అంతేకాదు ఏకంగా రొమాంటిచ్ సీన్స్, న్యూడ్ సీన్స్ లోను నటించి హాలీవుడ్ లో కూడా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ఇంత స్టార్ డం తో కెరీర్ మంచి పీక్స్ స్టేజ్ లో ఉన్నప్పుడే ప్రియాంక అమెరికన్ సింగర్ నిక్ జొనాస్‌ ని పెళ్ళి చేసుకొని నార్త్ ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చింది. ఇక రీసెంట్‌గా ప్రియాంక తన భర్త, అమెరికన్ సింగర్ నిక్ జొనాస్‌తో కలిసి గ్రాండ్‌గా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు. 

 

ప్రియాంక, నిక్‌లకు పెళ్ళి అయ్యాక ఇది రెండో క్రిస్మస్. ఈ సందర్భంగా నిక్.. తన బ్యూటిఫుల్ భార్య కోసం ఖరీదైన బ్యాట్ మొబైల్ కారును కొనిచ్చాడు. బ్యాట్‌మ్యాన్ ఆకారంలో ఉండే ఈ కారు చాలా ఫేమస్. ఈ సందర్భంగా ప్రియాంక తన భర్తను ఎక్కించుకుని తన ఇంటి ముందు కురుస్తున్న మంచులో చక్కర్లు కొడుతూ తెగ ఎంజాయ్ చేసింది. ప్రియాంక బ్యాట్‌ మొబైల్ కారుపై కూర్చుని నవ్వుతూ ఇచ్చిన పోజ్‌ను నిక్ క్లిక్‌మనిపించాడు. ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘తన నవ్వు కంటే విలువైనది ఏముంటుంది’ అని అందమైన క్యాప్షన్ ఇచ్చాడు.

 

ప్రియాంకను నిక్ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. తనకు సౌకర్యంగా అనిపించే జీవన విధానాన్నే సాగిస్తున్నాడు. అన్నీ ప్రియాంకకు నచ్చినట్లుగానే చేస్తుంటాడు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందు ప్రియాంకతో చర్చించాకే తీసుకుంటాడు. ప్రియాంక కూడా అంతే. వయసులో నిక్ ప్రియాంక కంటే పదేళ్లు చిన్నవాడు. దాంతో వీరిద్దరి పెళ్లిపై చాలా మంది నుంచి విముఖత ఏర్పడింది. కానీ రోజురోజుకీ వీరి మధ్య పెరుగుతున్న ప్రేమ, అన్యోన్యతను చూసి హవ్వ.. అంటూ వెక్కిరించినవారంతా ఇప్పుడు సిగ్గుపడుతున్నారు. ఇక ఎక్కడున్నాము..పక్కన ఎవరున్నారు అనేది చూసుకోకుండా వీళ్ళు చేసే పబ్లిక్ రొమాన్స్ కూడా హాట్ టాపిక్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: