టాలీవుడ్ లో ఎక్కువగా మల్టీస్టారర్ మూవీస్ తో అలరిస్తున్న విక్టరీ వెంకటేష్ మొదటిసారిగా తన సొంత మేనళ్లుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ‘వెంకిమామ’ రిలీజ్ మంచి హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.  ఈ మూవీ మొదటి నుంచి అంచనాలు పెంచుతూ వస్తుంది.  మజిలీ మూవీతో నాగ చైతన్య, ఎఫ్ 2 మూవీతో వెంకటేష్ ఈ ఏడాది సూపర్ హిట్స్ అందుకున్నారు.  ఈ నేపథ్యంలోనే బాబీ దర్శకత్వంలో ఇద్దరు హీరోలు కలిసి నటించిన ‘వెంకిమామ’ మంచి విజయం అందుకుంది.  

 

ఇక వెంకి సరసన సెక్సీ బ్యూటీ పాయల్ రాజ్ పూత్, నాగ చైతన్య సరసన అందాలభామ రాశీఖన్నా నటించింది. తమన్ మ్యూజిక్ అద్భతంగా అందించారు.  కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమా అయినా తెలుగు ప్రజలు ఆదరిస్తారని మరోసారి రుజువైంది.  ఫ్యామిలీ ఆడియన్స్ ఓన్ చేసుకుంటే ఎలాంటి సినిమాని అయినా హిట్ చేస్తారని మరోసారి రుజువైంది.  క్రిటిక్స్ ఈ మూవీకి సాధారణ రేటింగ్ ఇచ్చారు, ఆడియన్స్ కూడా పర్వాలేదని మాత్రమే అన్నారు.  ఈ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.36 కోట్లకు బిజినెస్ చేసారు. తెలుగు రాష్ట్రాల నుండే 31 కోట్ల బిజినెస్ జరిగింది.

 

మొదటి వీకెండ్ తిరుగులేకుండా సాగినప్పటికీ.. రూరల్, ప్రతిరోజూ పండుగే, దొంగ మూవీస్ రిలీజ్ తర్వాత కాస్త తగ్గింది.  ఇక ప్రతిరోజూ పండుగే మంచి హిట్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా బాగాన వస్తున్నాయి. నిన్న క్రిస్మస్ సందర్భంగా వెంకీ మామ సూపర్ గా అడ్వాంటేజ్ ను క్యాష్ చేసుకుంది. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటికి పైగా షేర్ వసూలు చేసింది.

 

వెంకీ మామ దాదాపు 28 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది. మరో మూడు కోట్లు వసూలు చేయగలిగితే వెంకీ మామ బ్రేక్ ఈవెన్ చేరుకోవడం ఖాయం అంటున్నారు టాలీవుడ్ వర్గాలు.  ఇక రూ.36 కోట్లకు థియేట్రీకల్స్ అమ్ముడుపోగా ఇప్పటికే ఇప్పటికే రూ.34 కోట్లు వచ్చేసాయి. వచ్చే శని, ఆదివారాల్లో మళ్ళీ కలెక్షన్స్ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.

‘వెంకిమామ’ కలెక్షన్లు : 


నైజాం : రూ. 10.92 కోట్లు
సీడెడ్ : రూ.4.42 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ.  4.45 కోట్లు
గుంటూరు : రూ. 2.11 కోట్లు
కృష్ణ : రూ. 1.63 కోట్లు
ఈస్ట్ గోదావరి : రూ.  2.14 కోట్లు
వెస్ట్ గోదావరి: రూ. 1.32 కోట్లు
నెల్లూరు : రూ. 0.93 కోట్లు
.................................................
మొత్తం : రూ.. 27.92 కోట్లు
..........................................

మరింత సమాచారం తెలుసుకోండి: