`అల వైకుంఠపురములో` చిత్రం సంక్రాంతి  పండగ కు వస్తున్న టాలీవుడ్ కోడి పుంజుల్లో ఒకటి. ఈ చిత్రం నుంచి వ‌చ్చిన పాట‌ల‌న్నీ దాదాపుగా హిట్టే. ఒక సినిమాలో ఉన్న నాలుగు  పాట‌ల్లో విడుద‌లైన మూడు పాట‌లు హిట్ అంటే మాములు మాట‌లు కాదు.  దీంతో ఫ్యాన్స్ అంద‌రి దృష్టి ఒక్క‌సారిగా అల వైపు తీరిగిపోయింది. 

 


అల వైకుంఠపురములో రెండు పాటలు 100 మిలియన్ హిట్ లు దాటాయి. ఈ రెండు పాటలు ఒక‌టి ఫ‌స్టాఫ్‌లో వ‌స్తే రెండోది సెకండాఫ్‌లో వ‌స్త‌ది టాక్ వినిపిస్తుంది. సినిమా లో తొలుతగా వచ్చే సాంగ్, ఓ మై డాడీ అంటూ ర్యాప్ స్టయిల్ లో సాగే పాట. ఆ తరువాత వచ్చే పాట 'సామజవరగమన' సాంగ్. ఆ తరువాత 'అల వైకుంఠపురములో'. ఈ పాట ముందు గతంలో అత్తారింటికి దారేదిలో వచ్చినట్లే శాస్త్రీయ ఆలాపన కూడా వుంటుంది.

 

ఇంట‌ర్‌వెల్ త‌ర్వాత వ‌చ్చే పాటే 'బుట్ట బొమ్మ' , ప్రీ క్లయిమాక్స్ లో 'రాములో..రాములా' సాంగ్ వుంటుంది. చివర్లో క్లయిమాక్స్ టైమ్ లో ఇప్పటి వరకు ఇంకా విడుదల చేయని శ్రీకాకుళం జానపద స్టయిల్ లో వుంటే చిన్న బిట్ సాంగ్ వస్తుంది. మ‌రి పాట‌ల‌తో ఒక్క‌సారిగా ప్రేక్ష‌కుల‌ను ఇంత అటెన్ష‌న్‌లో పెట్టిన ఈ చిత్రం విడుద‌ల‌య్యాక ఇంకెలాంటి రిజ‌ల్ట్ ఇస్తుందో అని అంద‌రూ వెయిటింగ్‌లో ఉన్నారు. అందులోనూ స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ నుంచి చాలా గ్యాప్ త‌ర్వాత వ‌చ్చే చిత్ర‌మిది కాబ‌ట్టి దీంతో ఆల్‌మోస్ట్ అంద‌రి చూపు దీని వైపే ఉంది.  ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల కానుంది. తాజాగా ‘అల వైకుంఠపురములో’ సినిమాను అల్లు అర్జున్‌కు త్రివిక్రమ్ 2 గంటల 25 నిమిసాలు అని చెప్పాడట. తీరా ఫైనల్ కట్ చేస్తే.. 3 గంటలకు పైగా వచ్చిందట. సినిమాలో ముఖ్యమైన సన్నివేశాలతో పాటు కామెడీ,యాక్షన్ సీన్లు చాలా ఉన్నాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: