యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా ప్రస్తుతం టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రోగ్రెస్, హీరోయిన్స్, విలన్ పాత్రధారుల డీటెయిల్స్ రిలీజ్ చేసింది ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్. స్వాతంత్రోద్యమ బ్యాక్ డ్రాప్ లో అత్యంత భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తుండగా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. 

 

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ విషయమై ఇప్పటికే మధ్యలో కొంత బ్రేకులు పడుతూ ముందుకు సాగుతోందని ఆర్ఆర్ఆర్ యూనిట్ కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, ఇప్పుడు మరొక పెద్ద తలనొప్పి ఈ సినిమా యూనిట్ కి వచ్చి పడిందని టాలీవుడ్ వర్గాల టాక్. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఈ సినిమాను మొదటి నుండి అందరూ కూడా ఆర్ఆర్ఆర్ అనే వర్కింగ్ టైటిల్ తోనే పిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే పూర్తి టైటిల్ ని అతి త్వరలో ప్రకటించనున్న నేపథ్యంలో, నిన్న ఒక చిన్న నిర్మాణ సంస్థ ఆర్ఆర్ఆర్ టీమ్ కి భారీ షాక్ ఇచ్చింది. 

 

వాస్తవానికి ముందుగా ఈ సినిమాకు రామ రావణ రాజ్యం అనే టైటిల్ ని పెట్టాలని అనుకున్నట్లు సమాచారం. అయితే షాకింగ్ గా ఆ సినిమా టైటిల్ ఇప్పటికే రిజిస్టర్ కూడా అయిపోయినట్టు ఆర్ఆర్ఆర్ టీమ్ దృష్టికి వచ్చిందట. వి3 ఫిలిమ్స్ అనే సంస్థ ఈ సినిమా టైటిల్ ని ఫిలిం ఛాంబర్ లో ఇటీవల రిజిస్టర్ చేయించినట్టు చెప్తున్నారు. రామ రవాణ రాజ్యం అనే టైటిల్ కు మంచి క్రేజ్ ఉండటంతో అది గ్రహించిన ఆ సంస్థ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తమ పేరిట రిజిస్టర్ చేయించిందని, దీనితో ఇప్పుడు ఏ టైటిల్ పెట్టాలో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కి అర్ధం కాని పరిస్థితి నెలకొందని టాలీవుడ్ వర్గాల్లో వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియదని, దీనిపై పూర్తిగా అధికారికంగా వివరాలు తెలియాల్సి ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: