త్రిష కృష్ణన్...ఏ.ఏం.రత్నం నిర్మించిన నీ మనసు నాకు తెలుసు సినిమాతో ఒకేసారి అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న తరుణ్-శ్రియ శరణ్ నటించిన ఈ సినిమాలో త్రిష కూడా హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత ఎం.ఎస్.రాజు నిర్మించగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన వర్షం సినిమాతో తెలుగులో స్టార్ హీరోయిన్ గా సెటిలయిపోయింది. మెగాస్టార్, మహేష్ బాబు, నాగార్జున, వెంకటెష్, బాలకృష్ణ, తారక్, నితిన్...ఇలా దాదాపు అందరితోను నటించింది. ఇక కోలీవుడ్ లోను స్టార్ హీరోలందరి సరసన నటించి అక్కడ కూడా స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. అయితే మధ్యలో కొంత గ్యాప్ రావడంతో త్రిష పనైపోయిందని అనుకున్నారు. 

 

కాని '96' సినిమా సృష్ఠించిన సంచలనాల గురించి తెలిసిందే. 2018 అక్టోబర్ 4న రిలీజైంది. కెరీర్ ఇక అయిపోయింది అనుకుంటున్న సమయంలో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు సహకరించిన చిత్రమిది. చెప్పాలంటే సెకండ్ ఇన్నింగ్స్ త్రిష కి ప్రాణం పోసింది. హృద్యమైన ఫీల్ గుడ్ కథతో ఆద్యంతం వాస్తవిక కోణంలో దర్శకుడు సి.ప్రేమ్ కుమార్ ఈ సినిమాని కొత్త పంథాలో తెరపైకి తీసుకొచ్చిన తీరు ప్రశంసలు కురిపించేలా చేసింది. 2018 అక్టోబర్ లో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది.

 

ఈ సినిమాలో జాను పాత్రలో నటించిన త్రిషపై విమర్శకులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ప్రశంసలతో పాటు ఈ సినిమా త్రిషకు అత్యధిక అవార్డుల్ని తెచ్చిపెట్టింది. ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ నుంచి నిన్నటి ఫిల్మ్ ఫేర్ వరకు త్రిష మొత్తం 11 అవార్డులని ఈ సినిమాతో సొంతం చేసుకోవడం ఒక రికార్డేనని చెప్పాలి. ఇన్ని పురస్కారాల్నిఇప్పటివరకు ఒకే సినిమాకి ఏ హీరోయిన్ సొంతం చేసుకోలేదని చెప్పాలి. దీంతో త్రిష ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అంతేకాదు ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోలందరి చూపు త్రిష మీదే ఉండటం విశేషం. 

 

96 సినిమాకి ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ ని సొంతం చేసుకున్న ఆనందంలో ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న త్రిష తనకు '96' సినిమా ద్వారా వచ్చిన అవార్డుల ఎగ్జిబిషన్ పెట్టేసింది. అవార్డుల్ని అందుకున్న తన్మయత్వంతో ఫొటోలకు పోజులిచ్చింది. త్రిష ఏకంగా 11 అవార్డుల్ని పట్టుకుని పొజిచ్చింది. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. త్రిష- విజయ్ సేతుపతి జంటగా నటించిన '96' తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. శర్వానంద్- సమంత జంటగా నటిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: