యష్ నటించిన కెజిఎఫ్  చాప్టర్ 1 యొక్క హిందీ వెర్షన్ చిత్రం  ఐటమ్ సాంగ్ లో నటించిన  మౌని రాయ్ ప్రస్తుతం బీచ్‌లో సెలవులను ఆస్వాదీస్తుంది.కెజిఎఫ్ ఐటమ్ గర్ల్ ప్రస్తుతం బీచ్ లొకేషన్ వద్ద విహారయాత్రలో ఉంది.  ఎరుపు బికినీలో తన సిజ్లింగ్ హాట్ చిత్రాన్ని సోషల్ మీడియా ద్వారా  మౌని రాయ్ పంచుకుంది. ఈ చిత్రాలు  సోషల్ మీడియాలో వైరల్ అవుతూ  తన అభిమానులను ఆనందపరుస్తున్నాయి. మౌని రాయ్ తన కొన్ని చిత్రాలను రెడ్ బికినీలో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.   తన అభిమానులను ఎలా ఆక్కటుకోవాలో మౌని రాయ్  కి బాగా తెలుసు.

 

 

 

 

 

 

 

 

మౌని రాయ్ టెలివిజన్ షోలలో కొన్నేళ్లు పనిచేసిన తరువాత హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి అడుగు పెట్టారు. గత ఏడాది అక్షయ్ కుమార్ నటించిన గోల్డ్ చిత్రంతో ఈ నటి అరంగేట్రం చేసింది, ఇది బాక్సాఫీస్ వద్ద సగటు కలెక్షన్ లు సంపాదించింది. 2006 లో క్యుంకి సాస్ భీ కబీ బాహు థి అనే టెలివిజన్ ధారావాహికలో నటించిన తర్వాత ఆమె కీర్తిని పొందింది. మౌని రాయ్ ఉత్తర భారత ప్రేక్షకులకు బాగా తెలిసిన ముఖం మాత్రమే కాదు, టీవీలో నాగిని సిరీస్ యొక్క తెలుగు వెర్షన్‌లో ఆమెను చూసిన తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే.

 

 

 

 

 

 

 

 

 

మౌని రాయ్ ప్రస్తుతం అయాన్ ముఖర్జీ  బ్రహ్మాస్త్రా చిత్రంలో నటిస్తుంది, ఈ చిత్రం లో  ఆమె రణబీర్ కపూర్ మరియు అలియా భట్ లతో కలిసి కనిపిస్తుంది. ఈ ఫాంటసీ డ్రామాలో అక్కినేని నాగార్జున అతిధి పాత్రలో నటిస్తున్నారు. ఆసక్తిగల సోషల్ మీడియా యూజర్ అయిన మౌని రాయ్ తన అభిమానులను తన అద్భుతమైన చిత్రాలతో ఆకట్టుకుంటుంది.  మరోసారి ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తన అందచందాలను చూపిస్తూ   ఎర్రటి బికినీలో పోజులిచ్చిన చిత్రాలను పోస్ట్ చేసింది.  మౌని రాయ్ తన ఖాతా లో  పెద్ద బడ్జెట్ చిత్రాలను కలిగి వుంది. ఆమె  కరణ్ జోహార్ యొక్క బ్రహ్మాస్త్రంలో కనిపిస్తుంది. ఇది కాకుండా, మౌని రాయ్ మేడ్ ఇన్ చైనా మరియు మొగల్ లలో చిత్రాలలో కూడా ఒక  భాగం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: