రాధికా ఆప్టే నటిగా మాత్రమే కాక ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈమె కొన్ని హాలీవుడ్ సినిమాలలో, హిందీ సినిమాలలో నటిస్తోంది. చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే సినిమాల్లో అవకాశాలు తగ్గుతాయని భావించి సినిమాలకు దూరంగా ఉంటారు. కానీ రాధికా ఆప్టే మాత్రం పెళ్లైన తరువాతే సినిమాల్లోకి అడుగుపెట్టింది. రాధికా ఆప్టే కొన్ని సినిమాల్లో నగ్నంగా కూడా నటించింది. 
 
రాధికా ఆప్టే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను సినిమాల్లో నగ్నంగా నటించినప్పటికీ ఈ విషయంలో తన భర్తకు తనకూ ఎప్పుడూ గొడవలు జరగలేదని చెప్పింది. రాధికా ఆప్టే పెళ్లికి ముందు ఇద్దరు వ్యక్తుల వలన వింత అనుభవం ఎదురైందని ఆ అనుభవం గురించి చెప్పుకొచ్చారు. తానెప్పుడూ చిన్న వయస్సు వాళ్లతో డేటింగ్ చేయలేదని కానీ ఒకేరోజు ఇద్దరు డేటింగ్ కు రమ్మని పిలిచారని చెప్పారు. 
 
తనను డేటింగ్ కు పిలిచిన వారిలో తన భర్త బెనెడిక్ట్ కూడా ఉన్నాడని ఆ సమయంలో నేను నా రూం మేట్ కలిసి టూనా చేపను ఇంట్లో ఉండే పిల్లికి పెట్టాలని నిర్ణయం తీసుకున్నానని పిల్లి ఆ చేపను తింటే మాత్రమే బెనెడిక్ట్ తో డేటింగ్ వెళ్లాలని అనుకున్నానని ఆ పిల్లి చేపను తినడంతో డేటింగ్ కు వెళ్లానని రాధికా ఆప్టే చెప్పుకొచ్చింది. డేటింగ్ చేసిన బెనెడిక్ట్ నే ఆ తరువాత పెళ్లి చేసుకున్నానని రాధికా ఆప్టే చెప్పుకొచ్చారు. 
 
తాను సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నగ్నంగా నటించటంపై కూడా రాధికా ఆప్టే స్పందిస్తూ భారతీయ సినిమాల్లోనే కాదు బయటి సినిమాల్లో కూడా నగ్నంగా నటించడం తప్పేం కాదని చెప్పింది. తన బాడీతో తనకు పూర్తి స్వేచ్ఛ ఉందని తన వరకు అలా కనిపించడం అస్సలు ఇబ్బంది కాదని రాధికా ఆప్టే చెప్పుకొచ్చింది. అలా అని చెప్పి ఏ కథ పడితే ఆ కథ తీసుకొచ్చి నగ్నంగా నటించమంటే మాత్రం నటించనని రాధికా ఆప్టే చెప్పింది. రాధికా ఆప్టే తెలుగులో బాలకృష్ణకు జోడీగా లయన్, లెజెండ్ సినిమాల్లో నటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: