సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వాలని ఆశపడే ఔత్సాహిక హీరో హీరోయిన్స్ కు ఆడిషన్స్ నిర్వహించడం వారికి మేకప్ టెస్ట్ లు చేసి వారు ఆ పాత్రలకు సరిపోతారా లేదా అన్న విషయమై ఒక నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న అలవాటు. అయితే మెగా స్టార్ హోదాను అనుభవిస్తూ 150 సినిమాలకు పైగా నటించిన చిరంజీవి పై మేకప్ టెస్ట్ చేసే సాహసం కొరటాల శివ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.

తెలుస్తున్న సమాచారం మేరకు ముంబాయి నుండి ప్రత్యేకంగా వచ్చిన కొందరు స్టైలిస్ట్ లు చిరంజీవి పై మేకప్ టెస్ట్ చేసి అతడి లుక్ కు సంబంధించి కొన్ని సూచనలు ఇవ్వడమే కాకుండా చిరంజీవికి చేసిన మేకప్ టెస్ట్ కు సంబంధించి కొన్ని ఫోటోలను వివిధ యాంగిల్స్ లో తీసి కొరటాల శివకు ఇచ్చిన సందర్భం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. ఈ విషయం కొరటాల చిరంజీవిల కాంబినేషన్ మూవీకి సంబంధించింది. 

వాస్తవానికి ఇప్పటికే చిరంజీవి లుక్ కు సంబంధించి కొన్ని డ్రాయింగ్ స్కెచ్ లను కొరటాల డిజైన్ చేయించినా ఆ డ్రాయింగ్స్ పై కొరటాలకు పూర్తి క్లారిటీ రాకపోవడంతో చిరంజీవి లుక్ కు సంబంధించి ముంబాయి నుంచి వచ్చిన ఒక స్పెషల్ టీమ్ చేత ఈ లుక్ కు సంబంధించిన టెస్ట్ లు చిరంజీవికి పెట్టినట్లు సమాచారం. అయితే చిరంజీవి మాత్రం ఆ మేకప్ టెస్ట్ లకు ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా ముంబాయి టీమ్ కు తన మెగా స్టార్ హోదాను పక్కకు పెట్టి సహకరించినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇది ఇలా ఉండగా చిరంజీవి కొరటాల మూవీ షూటింగ్ జనవరి 3న మొదలు అవ్వడానికి పూర్తి రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన మొదటి షెడ్యూల్ లో చిరంజీవి పై ఇంట్రడక్షన్ సీన్స్ తో పాటు ఒక పాటను కూడ చిత్రీకరిస్తారని తెలుస్తోంది. అయితే ఈ మూవీ హీరోయిన్ త్రిషతో తీసే సీన్స్ ఈ షెడ్యూల్ లో ఉండవని ఆమె ఈమూవీ సెకండ్ షెడ్యూల్ లో జాయిన్ అవుతుందని టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: