యంగ్ హీరో నితిన్ వెండితెర ప్రయాణం సాఫీగా సాగుతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతున్న ఆయన.. ఈ ఏడాది ఏకంగా నాలుగు సినిమాలను ఓకే చెప్పేశాడు. అందులో ఒకటి భీష్మ. ఈ సినిమాలో నితిన్ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ముగింపు దశకు చేరింది. ఇటీవలే హైదరాబాదులో నితిన్, రష్మిక జంట పై ఓ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ ఫినిష్ చేశారు. మరికొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది.

 

నితిన్, రష్మిక మండన్న హీరో హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భీష్మ’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఇటలీలోని పాసిటానో ప్రాతంలోని అందమైన లొకేషన్స్ లో జరుగుతోంది. తాజాగా ఈ ప్రాంతంలో నితిన్, రష్మికలు ‘వార్’ సినిమాలోని హ్రితిక్ రోషన్ సాంగ్ ‘గుంగురో’ సాంగ్ కి డాన్స్ చేసిన వీడియోను షేర్ లవ్ యు హ్రితిక్ అంటూ పోస్ట్ చేసారు నితిన్ రష్మికలు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 

సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు పెట్టిన 'సింగల్ ఫరెవర్' అనే క్యాప్షన్ చూస్తుంటే నేటితరం యువతకు ఓ సరికొత్త కథను పరిచయం చేయబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఈ సినిమాపై ఇటు రష్మిక, అటు నితిన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.  ఇటీవలే దీపావళి కానుకగా విడుదలైన భీష్మ పోస్టర్స్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకున్నాయి. దీంతో సినిమాకు సంబంధించి మరిన్ని ఆసక్తికర అప్‌డేట్స్ ఇస్తూ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేపట్టాలని ప్లాన్ చేస్తోందట చిత్రయూనిట్. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, నితిన్ రొమాంటిక్ సీక్వెన్స్ హైలైట్ కానుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: