ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఒక క్లారిటీ రాబోతోంది. ఇప్పటికే అమరావతి నుండి విశాఖపట్నం రాజధాని తరలింపు ఖరారు అయిపోయిన నేపధ్యంలో ఈరోజు మరికొద్ది గంటలలో క్యాబినెట్ సమావేశం తరువాత ప్రకటింపబోయే నిర్ణయం గురించి అందరు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. పేరుకు ప్రస్తుతానికి విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని అన్నప్పటికీ రానున్న రోజులలో పూర్తి స్థాయి రాజధానిగా విశాఖపట్నం అమరావతి  స్థానంలో అవతరించబోతోంది అన్నది ఓపెన్ సీక్రెట్.

అయితే ఇలాంటి కీలక నిర్ణయాలు వెలుగు చూడబోతున్న ఈ సమయంలో పవన్ దేశంలో ఉండకుండా రష్యా తన భార్యా పిల్లలతో కలిసి వెళ్ళడం వెనుక ఒక ఎత్తుగడ ఉంది అన్న ప్రచారం ఉంది. వాస్తవానికి పవన్ కు విపరీతమైన క్రేజ్ ఉభయగోదావరి జిల్లాలు ఉత్తరాంద్ర ప్రాంతానికి చెందిన జిల్లాలలోనే ఎక్కువగా ఉంది. 

ప్రస్తుత రాజధాని ప్రాంతం అమరావతి ఉన్న కృష్ణా గుంటూరు జిల్లాలలో పవన్ కు అభిమానుల సంఖ్య తక్కువ మాత్రమే కాకుండా ఆ జిల్లాలలో పవన్ మ్యానియా బాగా తక్కువ. దీనితో విశాఖపట్నం రాజధాని కాబోతోంది అంటూ పండుగ చేసుకుంటున్న ఉత్తరాంద్ర ప్రజల ఉత్సాహాన్ని నీరు కారుస్తూ జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వెంటనే ప్రకటన ఇవ్వడం ఇష్టం లేక వ్యూహాత్మకంగా పవన్ క్రిస్మస్ వంకతో రష్యా వెళ్ళాడు అన్న ప్రచారం జరుగుతోంది. 

జగన్ అసెంబ్లీ ప్రకటన తర్వాత ఆవేశపడుతూ ఖంగారులో ట్వీట్ చేసి ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల ప్రజల ఆగ్రహానికి గురైన పవన్ ముందు చూపుతో జగన్ రాజధాని ప్రకటన అధికారికంగా ఈరోజు వచ్చిన తరువాత ఈనెల 30వ తారీఖు వరకు తన మౌనాన్ని కొనసాగించడానికి సాకుగా ఈ రష్యా పర్యటన పెట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈనెల 30న ‘జనసేన’ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగిన తరువాత మాత్రమే పవన్ తన మౌనముద్రను వీడుతాడు అని అంటున్నారు. అంతేకాదు ఈవిషయమై తొందరపడి విశాఖపట్నం రాజధాని విషయమై జనసైనికులు కూడ తొందరపడి నోరు జారవద్దు అంటూ పవన్ నాగబాబు ద్వారా జనసేన లోని ముఖ్యనాయకులకు సంకేతాలు పంపుతున్నట్లు టాక్. దీనితో పవన్ మరొకసారి చేస్తున్న ‘మౌనవ్రతం’ ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: