నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రూలర్’. హీరోగా బాలయ్యకు 105వ సినిమా. ‘జై సింహా’ తర్వాత  కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుద‌లై ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మాస్ ఓరియంటెడ్ మూవీగా తెర‌కెక్కిన ఈ చిత్రం ముఖ్యంగా బీ,సీ సెంటర్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసిన‌ట్లు అనిపించింది. 

 

సుమారు 40 కోట్ల ఓవర్ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా రిలీజ్ అవ్వడమే 15 కోట్ల డెఫిసిట్ లో రిలీజయింది. అలాగే సినిమా కూడా డిజాష్టర్ అవ్వడంతో అమ్మిన దానిలో సంగం కూడా రాకపోవడం డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ లాస్ ని మిగిల్చింది. ఆంధ్ర – తెలంగాణాలో 21.5 కోట్లకి అమ్ముడు పోయిన ‘రూలర్’ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కి సుమారు 13 కోట్ల భారీగా నష్టాన్ని చవి చూడనున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

 

‘రూలర్’ ఫస్ట్ వీక్ ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్స్:

నైజాం – 1.70 కోట్లు
సీడెడ్ – 1.99 కోట్లు
గుంటూరు – 1.58 కోట్లు
ఉత్తరాంధ్ర – 75 లక్షలు
తూర్పు గోదావరి – 50 లక్షలు
పశ్చిమ గోదావరి – 42 లక్షలు
కృష్ణా – 42.5 లక్షలు
నెల్లూరు – 36 లక్షలు

ఫస్ట్ వీక్ మొత్తం షేర్ – 7.72 కోట్లు

కర్ణాటక + ఇండియా – 1.12 కోట్లు

ఓవర్సీస్ – 0.54 కోట్లు

వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ – 9.38 కోట్లు

 

‘జై సింహా’ లాంటి హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణకి ఒక్క హిట్ కూడా రాలేదు. గ‌తంలో తీసిన క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు చిత్రాలు కూడా బాక్సీఫీస్ ముందు బోల్తా కొట్టాయి. ఇక పై రాబోయే బోయ‌పాటి సినిమా ఏమ‌వుతుందో అని ఫ్యాన్స్‌లో ఇప్ప‌టి నుంచే టెన్ష‌న్ మొద‌ల‌యింది. రూల‌ర్ నుంచి మంచి పవర్ ప్యాక్డ్ ఆక్షన్ ఎంటర్ టైనర్ ఆశించారు కానీ సినిమా మాత్రం అందరినీ నిరాశ పరిచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: