దర్శకుడు కె.ఎస్. రవీంద్రను బాబి అంటూ ఫిలిం ఇండస్ట్రీలో పిలుస్తూ ఉంటారు. వాస్తవానికి ఈ యంగ్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ వెంకటేష్ నాగచైతన్యలతో సినిమాలు చేసినా ఇప్పటికీ ఈ డైరెక్టర్ ను పూర్తిగా టాప్ యంగ్ హీరోల దగ్గర నుండి మిడిల్ రేంజ్ హీరోల వరకు గుర్తించడం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 

రెండు సంవత్సరాల క్రితం బాబి జూనియర్ తో ‘జై లవ కుశ’ మూవీ తీసాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా ఈ మూవీని నిర్మించిన కళ్యాణ్ రామ్ కు లాభాలను తెచ్చి పెట్టింది. ఇక ఈ మూవీలో విలన్ షేడ్స్ లో ఉండే ‘జై’ పాత్రను చాల సమర్ధవంతంగా పోషించడంతో జూనియర్ కు చాల మంచి పేరు వచ్చింది. 

అయితే ఈ మూవీకి దర్శకత్వం వహించిన బాబీకి మాత్రం పెద్దగా పేరు రాలేదు. ఇప్పుడు మళ్ళీ వెంకటేష్ నాగచైతన్యలతో బాబి తీసిన ‘వెంకీ మామ’ కు 70 కోట్ల గ్రాస్ కలక్షన్స్ ఇప్పటి వరకు వచ్చినా అందరు వెంకటేష్ గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప దర్శకుడు బాబి గురించి ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. 

దీనితో వరసగా రెండు హిట్ సినిమాలు తీసినా దర్శకుడు బాబి గురించి పట్టించుకోవడం లేదు సరికదా కనీసం అతడితో సినిమాలు చేయాలని పెద్దగా హీరోలు కానీ దర్శకులు కానీ ప్రయత్నించక పోవడంతో సినిమా సినిమాకు మధ్య బాబి కెరియర్ లో గ్యాప్ బాగా వస్తోంది. దీనితో బాబి తన టాలెంట్ ను ప్రమోట్ చేసుకోవడంలో ఈనాటి తరం దర్శకులతో పోటీ పడలేకపోతున్నాడా లేదంటే హీరోలకు నచ్చే విధంగా మాటలు చెప్పి బుట్టలో పెట్టే సమర్థత బాబిలో తక్కువగా ఉందా అంటూ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలు బాబి పై సానుభూతిని వ్యక్తం చేస్తున్నాయి. దీనితో బాబి ఎప్పుడ మారతాడు అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: