ల‌వ‌ర్‌బాయ్ ఇమేజ్‌ను ఎవ‌రైనా కుర్ర హీరోలు కోరుకుంటారు.. అయితే దానికి విరుద్ధంగా ఉన్నాడు మ‌నోడు. నాకు అలా పిలిస్తే చాలా చిరాకు అన‌డంతో నెటిజ‌న్లు మ‌నోడు చాలా ఓవ‌ర్ చేస్తున్నాడు అని సెటైర్లు వేస్తున్నారు.  

 

నాగ‌శౌర్య న‌న్ను అంద‌రూ ల‌వ‌ర్ బాయ్ అంటున్నారు. నాకు ల‌వ‌ర్‌బాయ్ అంటేనే  చాలా చిరాకు అని  ఈ రోజు ఉద‌యం జ‌రిగిన అస్వ‌థామ ట్రైల‌ర్  రిలీజ్ ఫంక్ష‌న్‌లో అన్నాడు. అలా పిలిస్తే నాకు అస్స‌లు న‌చ్చ‌దు. నా ఫేస్ లో ర‌ఫ్‌నెస్ ఉంట‌ది. అది ఎవ్వ‌రికీ తెలియ‌దు. ల‌వ‌ర్ బాయ్ అంటుంటే ఛ‌లో చిత్రం చేశాను. ఛ‌లో రెండు కోణాల్లో ఉన్న‌క‌థ కాబ‌ట్టి   స‌కెస్ అయింది. ఆ చిత్రానికి సంబంధించిన ఫంక్ష‌న్ కూడా రామానాయుడులోనే  జ‌రిగింది. మంచి సక్సెస్ అయింది. న‌ర్త‌న‌శాల ఇక్క‌డే అది డిజాస్ట‌ర్ న‌ర్త‌న‌శాల టైంలో నేను అంత యాక్టివ్ లేను. ఆ చిత్రం నేను చాలా  బ‌ల‌వంతంగా చేశాను. కానీ ఇప్పుడు ఈ సినిమా నేనే క‌థ రాసుకున్నాను నేనైతేనే  న్యాయం చేయ‌గ‌ల‌ను. మ‌హిళ‌లు పై జ‌రిగే అరాచ‌కాల గురించి తీశాను. మ‌హిళ‌లంటే నాకు చాలా గౌర‌వం అని అన్నారు.

 

ఛలో సినిమా తర్వాత సరైన విజయం కోసం చూస్తున్నాడు నాగశౌర్య. ఆ తర్వాత నటించిన సినిమాలు అంచనాలు అందుకోకపోవడంతో మళ్లీ డైలమాలో పడిపోయాడు ఈ కుర్ర హీరో. ఈ ఏడాది సమంతతో కలిసి నటించిన ఓ బేబీ సినిమా విజయం సాధించినా కూడా అది లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. ప్రస్తుతం ఈయన తన సొంత ప్రొడక్షన్‌లో 'అశ్వథ్థామ' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఈ రోజు ఉద‌యం  విడుదలయింది. ఉదయం 11 గంటల 7 నిమిషాలకు సమంత చేతుల మీదుగా విడుదల చేశారు.  ఓ బేబీ సినిమా నుంచి నాగశౌర్యతో సమంతకు మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పుడు అదే స్నేహాన్ని తన సినిమా కోసం వాడేసుకుంటున్నాడు శౌర్య. ఈ సినిమా కథ కూడా సమంతకు బాగా నచ్చడంతో నాగశౌర్యకు హెల్ప్ చేస్తుంది. పైగా ఈ చిత్ర కథ కూడా నాగశౌర్యే రాయడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: