యువ హీరోలతో పోటీగా సినిమాలు చేస్తున్నాడు నందమూరి నట సింహం బాలయ్య. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అందరి కంటే వేగంగా సినిమా చేస్తూ ఆరు పదుల వయసులో బాలకృష్ణ అభిమానులను అలరిస్తున్నారు. దీనితో నిర్మాతలు కూడా బాలక్రిష్ణ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన సినిమా కోసం దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

 

సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మరో మూడు సినిమాలకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 2024 ఎన్నికల వరకు ఎన్ని సినిమాలు కుదిరితే అన్ని సినిమాలు చేసెయ్యాలని భావిస్తున్నారట. మరో పది సినిమాలు ఈ నాలుగేళ్ళలో చెయ్యాలని భావిస్తున్నారట బాలకృష్ణ. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేయ్యాలని చూస్తున్నారట. పార్టీ కోసం కష్టపడాల్సిన సమయం వచ్చిందని బాలకృష్ణ యోచిస్తున్నట్టు సమాచారం.

 

అందుకే ఇప్పుడు వేగంగా సినిమాలు తనతో చెయ్యాలి అనుకున్న వాళ్ళతో చేసేసి, ఇక సినిమాలకు విరామం ప్రకటించాలి అని బాలయ్య భావిస్తున్నారట. ఇదే విషయాన్ని కొందరు దర్శకులకు బాలకృష్ణ చెప్పెసినట్టు సమాచార౦. ఎన్నికలకు ముందు బాలయ్య.. బోయపాటి తో మరో సినిమా చేసే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అలాగే పూరి తో కూడా సినిమా హామీ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలు అన్ని కూడా పూర్తి చేసి ఇక తప్పుకునే యోచనలో ఉన్నారట.

 

ఇక బాల‌య్య వ‌రుసగా సినిమాలు చేయ‌డం ఎలా ఉన్నా ? ఆయ‌న అభిమానులు మాత్రం స‌రైన హిట్ సినిమా తీయాల‌ని కోరుకుంటున్నారు. ఈ యేడాది ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండు సినిమాల‌తో పాటు... ఇటీవ‌ల వ‌చ్చిన రూల‌ర్ సినిమాతో మూడు బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్లు ఇచ్చాడు. మ‌రి ఇక‌పై అయినా బాల‌య్య స‌రైన క‌థ‌లు తీసుకుని సినిమాలు చేస్తాడేమో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: