జబర్దస్త్ కామెడీ షో గూర్చి తెలియని వాళ్ళు ఉండరు... ఈటీవీ లో ప్రతి గురువారం మరియు శుక్రవారం జబర్దస్త్ ప్రసారం అవుతుంది.. ఇది పూర్తిగా కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం.. ఈ షో చూసినంత సేపు పొట్ట ముక్కలు అయ్యేలాగా నవ్వుతూ ఉండాల్సిందే జబర్దస్త్ కి పోటీగా ఎన్ని షో లు వచ్చినా కానీ జబర్దస్త్ మాత్రం రేటింగ్ లో మొదటి స్థానంలో ఉంది.

 

ఈ షోకి మరియొక బెనిఫిట్ ఏంటంటే యాంకరింగ్ చేసే అనసూయ భరద్వాజ్ అలాగే రష్మి గౌతమ్ లు.. వాళ్ళ అందాలతోటి, డాన్సులతోటి షో కి ప్రత్యేక అట్రాక్షన్ తెచ్చారు... రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ తర్వాత హిట్ పెయిర్‌గా నిలిచిన జంట.. అనసూయ భరద్వాజ్, హైపర్ ఆది. రష్మీ, సుధీర్ అంత కాకపోయినా.. అనసూయ, ఆది బాగానే చేస్తున్నారు. వీరిద్దరు కూడా బుల్లితెరపై రొమాన్స్ పండించాలని ట్రై చేస్తున్నారు.... రష్మీ అండ్ సుదీర్ పెయిర్ బాగా వర్కౌట్ అయింది..

 

ఇకపోతే అనసూయ అండ్ హైపర్ ఆది పెయిర్ ఈ మధ్యనే కొంచెం కొంచెం గా వర్కౌట్ అవుతుంది.. ఆది ప్రతి స్కిట్ లోను అనసూయ కి ఒక పాత్ర ఇస్తున్నాడు.. అలాగే పొగడ్తలతో ముంచేస్తున్నాడు.. ఈ వారం ప్రసారమయిన షో లో ఆది అనసూయ నడుముపై స్పూఫ్ చేసాడు.. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమాలో నడుము సీన్ ను మళ్ళీ రిపీట్ చేశాడు..

 

సినిమాలో పవన్ కళ్యాణ్ మరియు భూమికల మధ్య జరిగే ఈ నడుము సీన్ ఎంత హిట్ అయినదో చెప్పాల్సిన పనిలేదు... ఆది స్కిట్ లో భాగంగా బెంచ్ మీద కూర్చుని ఉంటాడు.. అనసూయ నలుపు రంగు చీర కట్టుకుని బెంచ్ మీద కూర్చుంటుంది... ఆది అనసూయ నడుము చూస్తాడు.. ఖుషి సీన్ రిపీట్ అయిద్ది.. అనసూయ మాత్రం ఈ సీన్లో కొంచెం ఇబ్బంది పడినట్లు కనిపించింది..

 

ఈ సన్నివేశం సహా ఆది స్కిట్ ఆసాంతం పంచ్‌లు, ప్రాసలతో కడుపుబ్బా నవ్వించింది. షోకు జడ్జిలుగా వ్యవహరించిన హీరో రాజ్‌తరుణ్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, రోజా నవ్వు ఆపుకోలేకపోయారు. స్కిట్ మొత్తం వారు కడుపుబ్బా నవ్వుతూనే కనిపించారు. ఈ సందర్భంగా హైపర్ ఆది స్కిట్లు అంటే తనకు చాలా ఇష్టమని రాజ్ తరుణ్ చెప్పడంతో ఆది పొంగిపోయాడు... ఎంతయినా డైలాగుల విషయం లో ఆది టైమింగ్ భలే కామెడీ గా ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: