తమిళ స్టార్ హీరో విక్రమ్.. ప్రయోగాత్మక సినిమాలు చేయాలన్న...సినిమాకు తగ్గట్టుగా తన బాడీని మార్చుకోవాలన్నా అది ఒక విక్రముడికే  సొంతం అని చెప్పాలి. ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక సినిమాలను చేసిన విక్రమ్ మరెన్నో అద్భుత విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక విక్రం దగ్గరకు వచ్చే కథలు కూడా అలాంటివే ఉంటాయి. అందుకే ఎప్పుడు ప్రయోగాత్మక సినిమాల్లోనే నటిస్తూ ఉంటారు స్టార్ హీరో విక్రమ్. ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. తన నటనతో కూడా అందరిని మెప్పించాడు విక్రమ్. తమిళ స్టార్ హీరోల్లో  విక్రమ్ కి మంచి క్రేజ్ ఉంది. మొదటి నుంచి అందరి హీరోల్ల  కాకుండా  విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. 

 


 ఇప్పటికి ఆయన ఈ సినిమా కోసం తన బాడీ ని ఎలాగైనా మలుచుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అంతేకాకుండా విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు విక్రమ్. అందుకే విక్రమ్ సినిమా వస్తుందంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది అని భావిస్తూ ఉంటారు ప్రేక్షకులు. అయితే విక్రమ్ కు  తమిళంలోనే కాదు తెలుగులో కన్నడలో కూడా మంచి క్రేజ్ ఉంది.ఆయన సిమిమాలు  టాలీవుడ్ లో కూడా మంచి విజయాలను అందుకున్నాయి . తాజాగా మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు హీరో విక్రమ్. అజయ్ జ్ఞానముత్తు  దర్శకత్వంలో  విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే  విక్రమ్ హీరోగా కోబ్రా సినిమా రూపొందుతోంది. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

 


 ఈ టైటిల్ కి సంబంధించిన సోషల్ మీడియాలో పోస్టర్ సోషల్ మీడియాలో విడుదల చేసారు . టైటిల్ దానిని డిజైన్ చేసిన తీరు కి మంచి మార్కులు పడ్డాయి. లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమా పై విక్రమ్ అభిమానులు భారీగా అంచనాలు పెరిగిపోయాయి. సినిమాలో  విక్రమ్ సరి కొత్తగా కనిపించబోతున్నాడు అని అంటున్నాయి  తమిళ ఫిల్మ్ వర్గాలు . ఇకపోతే ఈ మధ్యకాలంలో హీరో విక్రమ్ కి చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా పడలేదు. సీనియర్ స్టార్ హీరోల రేసులో ఆయన చాలా వెనుకబడి పోయారు. అయితే కోబ్రా సినిమాతో ఆయనకు ఎలాగైనా మంచి హిట్ పడుతుందని భారీ ఆశలు పెట్టుకున్నాడు విక్రమ్. చూడాలి మరి విక్రమ్ కోబ్రా  సినిమా ఎంత  వరకు ప్రేక్షకులను అలరించి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనేది .

మరింత సమాచారం తెలుసుకోండి: