ఎలా ఉంటాడో కూడా తెలియని ఒక రాక్షసుడు.. వాడికి మాత్రమే తెలిసిన ఒక రహస్యం..సైరన్ కూతల కింద పనిచేసే వాడి సైన్యం.. గమ్యం తెలియని ఒక యుద్ధం.. ఆ యుద్ధం గెలవాలంటే ఆరడుగుల నారాయణాస్త్రం కావాలి.. ఒక అశ్వద్ధాముడు రావాలి.. ఇది యువ హీరో నాగ శౌర్య అశ్వద్ధామ సినిమా టీజర్ లో వచ్చిన డైలాగ్స్. నాగ శౌర్య కథ అందించిన ఈ సినిమాను రమణ తేజ డైరెక్ట్ చేస్తున్నారు.

 

ఐరా క్రియేషన్స్ లో ఉషా ముల్పూరి, శంకర్ ప్రసాద్ ముల్పూరి నిర్మిస్తున్న సినిమా అశ్వద్ధామ. ఛలో సినిమాతో హిట్ అందుకున్న నాగ శౌర్య ఆ తర్వాత మరో రెండు ఫ్లాపులు చేశాడు. సమంత లీడ్ రోల్ లో వచ్చిన ఓ బేబీ సినిమాలో మంచి పాత్ర చేసిన నాగ శౌర్య అశ్వద్ధామతో పెద్ద టార్గెట్ పెట్టుకున్నట్టు ఉన్నాడు. ఇన్నాళ్లు లవర్ బోయ్ గా మాత్రమే సినిమాలు చేసిన నాగ శౌర్య ఈ అశ్వద్ధామతో మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది.

 

లవర్ బోయ్ ఇమేజ్ ఎంత ఉన్నా సరే మాస్ ఇమేజ్ వస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. అర్జున్ రెడ్డి సినిమా ముందు వరకు విజయ్ దేవరకొండ జస్ట్ ఓకే అనిపించుకున్నాడు. కాని అర్జున్ రెడ్డి తర్వాత అతను స్టార్ అయ్యాడు. నాగ శౌర్య కూడా తాను ఒక స్టార్ మెటీరియల్ అనిపించుకోవాలని తెగ ఆరాట పడుతున్నాడని తెలుస్తుంది. అయితే తనకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదలని నాగ శౌర్య నటన పరంగా ఓకే కాని కథల సెలక్షన్ లో మాత్రం ఇంకా పరిణితి చెందాల్సి ఉంది.

 

అశ్వద్ధామ సినిమాతో కచ్చితంగా నాగ శౌర్య మాస్ ఆడియెన్స్ కు దగ్గరయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. సినిమా టీజర్ చూస్తే చాలా ఇంటెన్షన్స్ ఉన్నట్టు అనిపించింది. ఈ సినిమా కోసం నాగ శౌర్య చాలా వర్క్ అవుట్స్ చేశాడు. మరి ఇంత చేసినా సరే నాగ శౌర్యకు హిట్టు దక్కుతుందా లేదా అన్నది సినిమా వస్తేనే కాని చెప్పలేం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: