బాలీవుడ్ లో మొదలైన మీటూ ఎఫెక్ట్ సౌత్ సినిమాల మీద పడ్డది. అందులో భాగంగా తమిళ రచయిత వైరముత్తు మీద సింగర్ చిన్మయి చేసిన కామెంట్స్ అందరికి తెలిసినవే. వైరముత్తు తనని లైంగికంగా వేధించిన విషయాన్ని బయటపెట్టింది. అయితే ఇలాంటి ఆరోపణలు చేసిన అతన్ని విచారించకుండా తనని సంవత్సరం పాటు ఎలాంటి ఆఫర్లు రాకుండా నిషేధించారు. మళ్లీ లేటెస్ట్ గా వైరముత్తు మీద తన విమర్శనాస్త్రం సందించింది చిన్మయి శ్రీపాద.

  

9 మంది మహిళలను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు ఉన్నా సరే వైరముత్తు మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా అతనికి అవార్డులు ఇస్తున్నారని విమర్శలు చేసింది చిన్మయి. తమిళ భాషకు ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం అవార్డ్ అందిస్తుంది. తమిళ భాషకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ వైరముత్తుకి డాక్టరేట్ ఇవ్వనున్నారు.       

 

తమిళ భాష మీద ఆయనకు ఉన్న పట్టు గుర్తించి వైరముత్తుకి డాక్టరేట్ ఇస్తున్నారని తెలుసు.. దానితో పాటుగా ఉత్తమ కామాంధుడు అనే అవార్డ్ కూడా ఇస్తారని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేసింది చిన్మయి. నేను చేసిన ఆరోపణల గురించి విచారణ జరిపించకపోగా అతడికి ఇంకా అవకాశాలు ఇస్తున్నారు. అయితే నా జీవితంలో లాగా మీ జీవితంలో వైరముత్తు లాంటి వ్యక్తి నేనెంత బాధపడ్డానో తెలుస్తుందని తనని ట్రోల్ చేసే వారికి పంచ్ వేసింది చిన్మయి.

 

వైరముత్తు, రాధారవిల మీద చిన్మయి సంచలన వ్యాఖ్యలు చేయగా ఏడాది పాటు ఆమెకు అవకాశం ఇవ్వలేదు. ఈమధ్యనే మళ్లీ ఒక సినిమాలో ఆమె పాడే అవకాశం ఇచ్చారు. తమిళంలో అవకాశాలు రాకున్నా తెలుగులో మాత్రం చిన్మయి వరుస సినిమాల్లో పాడుతుంది. చిన్మయి ఇలా రెచ్చిపితున్నా సరే వైరముత్తు మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: