ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగాడు సునీల్. బ్రహ్మానందం తరువాత ఆ రేంజ్ కమెడియన్ గా సునీల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస అవకాశాలతో ఒక దశలో రోజుకు ఒకే రోజు రెండు మూడు సినిమాల షూటింగుల్లో కూడా పాల్గొనేవాడు సునీల్. సునీల్ కామెడీ అంటే ఇష్టపడే ఫ్యాన్స్ ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు. కమెడియన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో సునీల్ కు హీరోగా ఆఫర్లు వచ్చాయి. 
 
తొలి సినిమా అందాలరాముడుతోనే సక్సెస్ కొట్టాడు సునీల్. ఆ తరువాత సునీల్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో హీరోగా నటించిన మర్యాదరామన్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తరువాత సునీల్ హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు ఫ్లాప్ కాగా వెంటనే పూలరంగడు సినిమాతో హిట్ కొట్టాడు. ఆ తరువాత కమెడియన్ పాత్రలకు దూరమై సునీల్ హీరోగా నటించటానికే ప్రాధాన్యత ఇచ్చాడు. 
 
కానీ పూలరంగడు సినిమా తరువాత సునీల్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లు అయ్యాయి. హీరోగా సునీల్ మార్కెట్ తగ్గుతూ వచ్చింది. ఒక దశలో సునీల్ కు హీరోగా అవకాశాలు కూడా తగ్గాయి. హీరోగా సక్సెస్ లు రాకపోవటంతో సునీల్ కమెడియన్ గా యూటర్న్ తీసుకున్నాడు. కానీ సునీల్ కమెడియన్ పాత్రల్లో నటించినా ప్రేక్షకుల నుండి సునీల్ కామెడీకి ఆశించిన స్థాయి స్పందన రావటం లేదు. 
 
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీయార్ హీరోగా నటించిన అరవింద సమేత వీరరాఘవ సినిమాలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించాడు సునీల్. చిత్రలహరి సినిమాలో కూడా సునీల్ నటించాడు. ఆ సినిమాలు హిట్టైనా సునీల్ కు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ప్రస్తుతం సునీల్ అల వైకుంఠపురములో సినిమాలో ఒక చిన్న పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సునీల్ కు కమెడియన్ గా పెద్దగా అవకాశాలు రావట్లేదని వార్తలు వస్తున్నాయి. సునీల్ చేతిలో అల వైకుంఠపురములో సినిమా మాత్రమే ఉందని తెలుస్తోంది. ఈ పాత్రతోనైనా సునీల్ కెరీర్ కు బ్రేక్ వచ్చి కమెడియన్ గా అవకాశాలు పెరుగుతాయో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: