ఒకప్పటితో పోలిస్తే నేటి కాలంలో యువత ఎవరికి వారు వ్యక్తిగత ఇష్టాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. చాలా విషయాల్లో ఎంతో తెలివిగా వ్యవహరిస్తున్న యువత, తమ జీవిత భాగస్వామి విషయమై కూడా ఎన్నో ఆలోచనలు చేసి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇక ఒకప్పటితో పోలిస్తే ఇప్పటికీ, కులం, మతం వంటివి పెళ్లిళ్ల విషయమై పట్టించుకునే వారు ఉన్నప్పటికీ, మెజారిటీ యువత మాత్రం తమ మనసుకు నచ్చిన వారికే ప్రాధాన్యతనిస్తున్నారు. ఇటీవల కొందరు హీరో, హీరోయిన్లు కూడా తాము ఇష్టపడ్డ వారిని ప్రేమించి, అనంతరం ఇంట్లో వాళ్ళను ఒప్పించి పెళ్లిళ్లు చేసుకుంటున్న వారు కూడా ఉన్నారు.  

 

ఇక ఇదే కోవలో నేడు హిందీ టివి నటి మోనా సింగ్ కూడా చేరిపోయింది. తన చిన్ననాటి స్నేహితుడైన బ్యాంక్ ఉద్యోగి శ్యామ్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. కోనేళ్ళుగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ఇకపోతే మొదట టివి నటిగా మంచి పేరు దక్కించుకున్న మోనా, కొన్నాళ్ల క్రితం అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన త్రి ఇడియట్స్ సినిమాలో హీరోయిన్ అక్క పాత్రలో నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం మరొక్కసారి అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చడ్డా సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది మోనా. 

 

అలానే మరికొన్ని సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించిన మోనాకు నేడు పలువురు నెటిజన్లు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. కాగా ఈ వేడుకకు ముఖ్యమైన ఆమె బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది. ఇక తన వివాహం సందర్భంగా, భర్త శ్యామ్ తో కలిసి పలు రకాలుగా ఫోజులిస్తూ ఫోటోలు, వీడియోలు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేసింది మోనా. కాగా ఆ ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: