నందమూరి బాలకృష్ణ పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతున్నట్లు తెలుస్తోంది. స్టోరీలను ఎంచుకోవడంలో ప్రజెంట్ జనరేషన్ ఆలోచనలకు తగ్గ రీతిలో బాలయ్య బాబు చేయటం లేదని ప్రవేట్ డైలాగులు అదే అరుపులు కేకలు నటనలో ఏమాత్రం కొత్తదనం చూపించడం లేదని ట్రెండ్ కి తగ్గ దగ్గర స్టోరీలను ఎంచుకోవడంలో బాలయ్య బాబు విఫలమవుతున్నారని అభిమానులు ఇటీవల బాలయ్య బాబు చేసిన సినిమాలు పోవటంతో తీవ్ర నిరుత్సాహం లో సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ వస్తున్నారు.

 

ఎన్టీఆర్ బయోపిక్ అంటూ రెండు సినిమాలు తీసి దారుణమైన డిజాస్టర్ చూసిన బాలయ్య బాబు ఆ తర్వాత తమిళ డైరెక్టర్ కెఎస్ దర్శకత్వంలో 'రూలర్' సినిమా తో  పెద్దగా మెప్పించింది ఏమీ లేదని సినిమా ఫ్లాప్ అవుతున్నా గాని రోజురోజుకీ మార్కెట్ పడిపోతున్న గాని బాలయ్య ధోరణి లో మార్పు రావడం లేదని నందమూరి అభిమానులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

 

తాజాగా ఇటీవల ఈనెల 20వ తారీఖున రిలీజ్ అయిన 'రూలర్' బాలయ్య ఇమేజ్ ను మరింతగా దెబ్బ తీసింది. కనీసం షేర్ తెచ్చుకో లేక రెండవ రోజుకే చతికిల పడింది. ఇది బాలయ్య కెరీర్ మరిచిపో దగ్గ చిత్రమని అభిమానులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు అంటే 'రూలర్' పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి తరుణంలో బోయపాటి బాలయ్య బాబుతో చేయబోతున్న మూడో సినిమా విషయంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం లేదని ముందు సినిమా కోసం 70 కోట్లు ఖర్చు పెట్టాలని భావించిన బోయపాటి...తాజాగా బాలయ్య బాబు నటిస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతూ ఉంటున్న తరుణంలో 70 కోట్ల భారీ బడ్జెట్ బాలయ్య బాబు కోసం ఖర్చు అంటే అది రిస్కుతో కూడిన విషయం అని నిర్మాత చెప్పినట్లు దీంతో బడ్జెట్ తగ్గించాలని బోయపాటికి ఆ సినిమా నిర్మాత తెలియజేసినట్లు ఫిలింనగర్లో వినపడుతున్న టాక్. దీంతో బాలయ్య బాబు సినిమా విషయంలో బడ్జెట్ విషయంలో బోయపాటి కూడా చేతులెత్తేసినట్లే అనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: