సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న ఓ సామాన్య యువకుడు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించాడు.  ఇంతకీ ఆ యువకుడు ఎవరా అనుకుంటున్నారా.. జబర్ధస్త్ లో వారం వారం తనదైన కామెడీ పంచ్ లతో కడుపుబ్బా నవ్విస్తున్న హైపర్ ఆది.  'జబర్దస్త్' కామెడీ షో ద్వారా చాలా మంది ఆర్టిస్టులు పాప్యులర్ అయ్యారు. అలాంటివారి జాబితాలో హైపర్ ఆది ముందు వరుసలో కనిపిస్తాడు. జబర్దస్త్ షో లో హైపర్ ఆది స్కిట్ లకి ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. స్కిట్ ఎలా ఉన్నా సరే, ఆ పదినిమిషాలూ ఆది వేసే పంచ్ లు మాత్రం అందర్నీ నవ్వుల్లో ముంచేస్తాయి. జబర్దస్త్ షో నుంచి నాగబాబు వెళ్లిపోవడం కారణమో.. డైరెక్టర్లు కూడా మారిపోవడం వలనో కానీ, జబర్దస్త్ స్కిట్ లలో కొంత ద్వంద్వార్థ దూకుడు ఎక్కువగా కనిపిస్తోంది.

 

కానీ హైపర్ ఆది, రేజింగ్ రాజు, దొరబాబు చేసే కామెడీ చూస్తే పడి పడీ నవ్వుతారు.  జబర్దస్త్ తాజా ఎపిసోడ్ లో హైపర్ ఆది స్కిట్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఎగస్ట్రా జబర్దస్త్ కి రష్మీ..సుధీర్ మధ్య పులిహోర స్టోరీ నడిపిస్తున్నట్టుగానే, జబర్దస్త్ లో అనసూయ..ఆది లతో పులిహోర స్కిట్ లు చేయిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మద్య జబర్ధస్త్ తో పాపులర్ అయిన సుడిగాలి సుధీర ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ అనే మూవీలో హీరోగా నటించారు. అంతే కాదు ఇప్పటికలే జబర్ధస్త్ తో పాపులర్ అయిన శకలక శంకర్ కూడా హీరోగా నటిస్తున్నాడు.   తాజాగా ఓ ఇంటర్వ్యూలో హైపర్ ఆది మాట్లాడారు.

 

సుడిగాలి సుధీర్ అంటే నాకు చాలా ఇష్టం. మొదటిసారిగా మా పరిచయం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఆ తరువాత ఇద్దరం కలిసి కొన్ని స్కిట్స్ చేశాము. సుధీర్ హీరో కావడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. తనలో హీరో కావాలన్న తపన కన్నా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే తపనే ఎక్కువ ఉంది.   నేను కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం వుంది. మంచి కథ నచ్చితే.. నాకు పాటలు .. ఫైట్లు అంతగా సెట్ కావు, ఒకవేళ చేస్తే అవి కూడా కామెడీగా అనిపిస్తాయి. మంచి కథ దొరకాలంతే హీరోగా నటిస్తానని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: