ఆడవాళ్ళ పై లైంగిక వేదింపులు ఎదో ఒక చోట ఎదో ఒక రకంగా జరుగుతూనే ఉన్నాయి.. లైంగిక వేధింపులకు ఆడవాళ్లు భలి అవుతున్నారు.. కొంతమంది బయట ప్రపంచానికి చెప్పగల్గుతున్నారు... కాని కొంతమంది చేసేది లేక తమలో తామే నలిగిపోతున్నారు..

 

అత్యాచారం చేసిన మగవాళ్ళు దైర్యంగా బయట తిరుగుతున్నారు.. తాజాగా ఒక తమిళ ఇండస్ట్రీ కి చెందిన తమిళ కవి "వైరముత్తు "పై తొమ్మిది మంది మహిళలని వేధించాడని లైంగిక ఆరోపణలు వచ్చాయి.. కాని ఇప్పటిదాకా అయన మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వైరముత్తు ని సత్కరించబోతున్నారు.. తమిళ భాషకు ఆయన చేసిన సేవలను గౌరవిస్తూ రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్.. వైరముత్తును సత్కరించనున్నారు. ..

 

ఈ విషయం పై తాజాగా చిన్మయి స్పందించారు. చిన్మయి ఈ మధ్య సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్  గా ఉంటున్నారు.. ఆడవాళ్ళకి సపోర్ట్ గా పోస్ట్స్ పెడుతున్నారు.. వైరముత్తు ని సత్కరించి డాక్టరేట్ ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు.. ట్విట్టర్ వేదికగా స్పందించారు." ఆరోపణలు ఎదుర్కొన్నవారికి ఏమీ కాదు. ఆరోపణలు చేసిన వారికే పని దొరక్కుండా చేస్తారు" అయన మీద ఆరోపణలు చేసిన వారికీ అవకాశం దక్కకుండా చేస్తున్నారు..

 

తమిళ భాష పట్ల వైరాముత్తుకు ఉన్న పట్టును గుర్తించి ఈ డాక్టరేట్ ఇస్తున్నారని నాకు తెలుసు. అదే విధంగా "ఉత్తమ కామాంధుడు అనే పురస్కారం కూడా ఇస్తారని ఆశిస్తున్నా"అని సింగర్ చిన్మయి ట్విటర్ వేదికగా మండిపడ్డారు.... ఇలాంటి కామాంధుడికి పిలిచి మరి గొప్ప గొప్ప సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారు. గొప్ప గొప్ప బిరుదులూ ఇస్తున్నారు.. అని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు..

 

నాపై కామెంట్స్ చేసే వాళ్ళకి ఇదే నా మెసేజ్ అని..... అనుభవం ఎన్నో పాటలు నేర్పుతుంది... వైరముత్తు లాంటి అతను మీ జీవితంలో ఉంటే నా బాధ ఏంటో మీకు తెలుస్తుంది అని అన్నారు. నాకు న్యాయం చేయండి అనే నేను అడుగుతున్నాను.. దానికి వైరముత్తు ఫ్యాన్స్ అంతలా ఎందుకు రియాక్ట్ అవుతున్నారో అర్ధం కావడంలేదని పోస్ట్ చేసారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: