మళయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్ ఎంత అందంగా ఉంటుందో అందరికి తెలిసిందే. అంతేకాదు నేచురల్ స్టార్ నాని కి ఫేవరేట్ హీరోయిన్ కూడా. వీళ్ళిద్దరు కలిసి నటించిన సినిమాలలో ఇద్దరి మధ్య కెమిష్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక నివేదా కి కూడా నాని అంటే విపరీతమైన అభిమానం. ఎంతంటే కనపడగానే పరిగెత్తుకుంటు వెళ్ళి గట్టిగా కౌగిలించుకునేంత. ఇప్పటికే నివేదా తెలుగులో నాని తో రెండు సినిమాలు, తారక్ తో ఒక సినిమా, కళ్యాణ్ రాం తో ఒక సినిమా శ్రీ విష్ణు తో ఒక సినిమా చేసింది. అంతేకాదు టాలీవుడ్ లో నివేదా కి మంచి పేరు కూడా ఉంది. 

 

అయితే 118 తర్వాత కెరీర్ కాస్త స్లో అయింది కాని మళ్ళీ ఉన్నట్టుండి ఒక్కసారిగా మళ్ళీ పిచ్చ స్పీడ్ అందుకుంది. ఒక్కోసారి అంతే. ఎవరి కెరీర్ అయినా కెరీర్ స్లోగా సాగుతూ ఉంటుంది. అన్నీ ఉంటాయి కానీ అవకాశాలు రావు. ఒక్కోసారి మాత్రం దానికి పూర్తిగా రివర్స్ లో అవకాశాలు వెల్లువలా వస్తాయి. ఊపిరాడనివ్వకుండా చేస్తాయి. ప్రస్తుతం నివేద థామస్ పరిస్థితి అలానే ఉందని తాజా పరిణామాలు చూస్తుంటే అర్థమవుతోంది.  మంచి నటిగా పేరుతెచ్చుకున్నప్పటికీ ఎందుకో నివేదకు కొంతకాలం పెద్దగా ఆఫర్లు రాలేదు. అయితే ఈమధ్య నివేదకు సడెన్ గా డిమాండ్ పెరిగింది.


పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఫిలిం 'పింక్' రీమేక్ లో ఒక కీలక పాత్రకు నివేదను ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ సినిమానే కాదు నివేదకు మరో ఆఫర్ కూడా వచ్చిందట. హీరో సిద్ధార్థ్ ప్రస్తుతం 'టక్కర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా నిర్మాత సుధన్ సుందరం సిద్ధార్థ్ తో వెంటనే మరో సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయిందట. ఈ సినిమాలోనే హీరోయిన్ గా నివేదకు అవకాశం దక్కిందని లేటెస్ట్ న్యూస్.

 

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని సమాచారం. ప్రాజెక్ట్ ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారట. ఇక ఈ సినిమా కు జయరామ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడిస్తారని సమాచారం. అయితే నివేదా ఇప్పటికే సూపర్ స్టార్ రజనీ కాంత్ నయనతార నటిస్తున్న దర్బార్ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు మరో సారి ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని, సుధీర్, అదితి రావు హైదరి కూడా నటిస్తున్నారు. ఇక నివేదా కి మొదటి నుంచి సినిమాలు అవకాశాలు రావడానికి తన సహజ నటన మాత్రమేనని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: