బుల్లి తెరపై సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న కామెడీ షో జబర్దస్త్.. ఈ షో ద్వారా తమ టాలెంట్ ను నిరూపించుకొని ఎందరో సినిమాలలో నటిస్తున్నారు.. ఈ మేరకు హైపర్ ఆది కూడా నాన్ సింక్ పంచులతో కడుపుబ్బ నవ్వించే కామెడీటైమింగ్ ఉన్న కమెడియన్ గా బాగా పాపులర్ అయ్యాడు.. అయితే ఈ మధ్య ఆది ఈటీవీవీలో ప్రసారమవుతున్న ఢీ డ్యాన్స్ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు..


ఇకపోతే ఈయనపై ఎఫైర్స్ వార్తలు మాత్రం ఇప్పటి వరకు రాలేదు. కెరీర్లో పెద్దగా ఎప్పుడూ అమ్మాయిలతో ఉన్నట్లు కూడా కనిపించలేదు ఆది. జబర్దస్త్ కామెడీ షోలో అప్పుడప్పుడూ అనసూయతో డ్యూయెట్స్ చేస్తూ కామెడీ చేయడం మినహా ఎవరితోనూ ఎఫైర్స్ నడుపుతున్నాడనే వార్తలు మాత్రం రాలేదు. అనసూయతో హద్దు దాటి ప్రవర్తిస్తున్న కూడా కాంట్రవర్సీ లకు కేరాఫ్ గా నిలవలేదు.

 

ప్రస్తుతం పరిస్థితులు అలా లేవు.. ఆదిపై ఎఫైర్ వార్తలు ఇప్పుడు వచ్చాయి.. ఈయన ఈ మధ్యే కమెడియన్ నుంచి హోస్టుగా కూడా మారాడు. పైగా వరసగా యాంకర్ వర్షిణితో కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ హోస్టింగ్ కూడా చేస్తున్నాడు. ఢీ ఛాంపియన్స్‌లో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే పండుతుంది. అమాయకంగా ఉండే వర్షిణిపై తనదైన పంచులు వేస్తూ నవ్విస్తున్నాడు ఆది. ఈ ఇద్దరే న్యూ ఇయర్ ఈవెంట్ కూడా హోస్ట్ చేసారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆది, వర్షిణి మధ్య సమ్‌థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.

 

అలా గాసిప్స్ పుట్టుకొని రావడానికి కారణం మాత్రం ఆది అనే మాటలు  వినపడుతున్నాయి. ఆయనే తమ ఇద్దరి మధ్య ఒకటి నడుస్తుందని ఒప్పుకున్నాడు. తాజాగా విడుదలైన ఢీ ఛాంపియన్స్ ప్రోమోలో అల వైకుంఠపురములో పాటకు డాన్సులు చేసారు వర్షిణి, ఆది జోడీ. ఈ ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది కూడా. అబ్బో అంటూ అంతా పొగిడేస్తుంటే.. ఈ మధ్యే మా ఇద్దరి మధ్య ఒకటి నడుస్తుందిలెండీ అంటూ ఆది హింటిచ్చాడు. యాంకర్ రవి వెళ్లిపోయిన తర్వాత వర్షిణికి జోడీ అయిపోయాడు హైపర్ ఆది. మరి ఈయన తీరు చూస్తుంటే కొన్ని రోజుల్లోనే కాంట్రవర్సీ రాజా కాస్తా పులిహోర రాజా అయిపోయేలా కనిపిస్తున్నాడు అని నెటిజన్లు అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: