ఈఏడాది మజిలీ,  వెంకి మామ  సినిమాలతో  బ్యాక్ టు బ్యాక్  విజయాలను  అందుకున్న  యువ సామ్రాట్ నాగ చైతన్య ప్రస్తుతం సెన్సిబుల్  డైరెక్టర్  శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో  తన 19వచిత్రంలో  నటిస్తున్నాడు.  యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా   తెరకెక్కుతున్న ఈ చిత్రానికి   లవ్ స్టోరీ అనే టైటిల్  ప్రచారం లో ఉంది.  ఈ చిత్రంలో   ఫిదా ఫేమ్ సాయి పల్లవి  హీరోయిన్ గా నటిస్తుంది.  దాంతో  క్రేజీ  కాంబినేషన్ లో  వస్తున్న  సినిమా కావడంతో  ఈచిత్రం పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 
 
ఈ చిత్రం యొక్క షూటింగ్  ప్రస్తుతం  నిజామాబాద్ జిల్లాలోని  ఆర్మూర్   గ్రామంలో  జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో లీడ్ పెయిర్ పై కొన్ని కీలక సన్నివేశాలను  చిత్రీకరిస్తున్నారు.  అందులో  భాగంగా  లొకేషన్ నుండి లీకైన   సాయి పల్లవి స్టిల్  ఒకటి  ప్రస్తుతం  సోషల్ మీడియాలో  సర్క్యులేట్ అవుతుంది.  ఆస్టిల్ లో  సాయి పల్లవి ట్రెడిషనల్ లుక్ లో కనిపించగా..   ఆ పిక్  నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇంతకుముందు  సాయి పల్లవి ఫిదా  లో కూడా  ఇలాంటి లుక్ లో కనిపించి  అభిమానులను ఫిదా చేసింది.  ఈ లవ్ స్టోరీని  నారాయణ దాస్ నారంగ్ ,  రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తుండగా  పవన్  సంగీతం అందిస్తున్నాడు.  వచ్చే ఏడాది ఏప్రిల్ 2న  ఈచిత్రాన్ని ప్రేక్షకుముందుకు తీసుకరావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రం తో పాటు సాయి పల్లవి  ప్రస్తుతం  తెలుగులో  విరాటపర్వం అనే చిత్రంలో నటిస్తుంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  సాయి పల్లవి , నక్సలైట్ పాత్రలో కనిపించనుండగా ఆమె కు జోడీగా రానా నటిస్తున్నాడు. నీదినాది ఒకే కథ ఫేమ్ వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కూడా  వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: