మెగా కాంపౌండ్ నుండి సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన అందరి హీరోల లో అందమైన కుర్ర హీరో మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. పెద్ద బాబాయ్ చిరంజీవి లుక్స్ చాలావరకు వరుణ్ తేజ్ లో కనబడతాయి. ముఖ్యంగా హైట్ విషయంలో మెగా కాంపౌండ్ లో వరుణ్ తేజ్ నీ మించిన హీరో మరొకరు లేరు. సినిమా స్టోరీ లు ఎంచుకోవడంలో క్లాస్  మరియు మాస్ ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా స్టోరీ లు ఎంచుకుంటూ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే విజయాలు సాధిస్తున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. 'ముకుంద' సినిమా తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వరుణ్ తేజ్ చాలా వరకు మెగా అభిమానులను ఆకట్టుకున్నాడు. ప్రతి సినిమాలో హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేస్తూ అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తూ కెరియర్ కొనసాగిస్తున్నాడు.

 

ముఖ్యంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన 'ఫిదా' సినిమా తో ఓవర్సీస్లో తనకంటూ సపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేస్తూ ఇటీవల బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి 'గబ్బర్ సింగ్' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో 'గద్దల కొండ గణేష్' అనే మాస్ సినిమా చేసి అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సినిమాలో వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్ కి థియేటర్ లో మెగా అభిమానులు గోల గోల చేశారు. మొత్తంమీద చూసుకుంటే మెగా కాంపౌండ్ హీరోలలో అన్ని రకాల సబ్జెక్ట్ కలిగిన సినిమాలు చేస్తూ త్వరత్వరగా సినిమాలు విడుదల చేస్తూ ఎక్కడా కూడా లేట్ లేకుండా ఈ ఏడాది వరుసగా రెండు సినిమాలు నటించి అదిరిపోయే విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు వరుణ్.

 

ఇటువంటి తరుణంలో సినీ పరిశ్రమలో వరుణ్ తేజ్ అడుగుపెట్టి ఐదు సంవత్సరాలు అయిన నేపథ్యంలో...ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ..తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ‘ఐదేళ్లు పూర్తయ్యాయి. సినీ పరిశ్రమలో అద్బుతమైన ప్రయాణం సాగింది. నాకు ఎప్పుడు మద్దతునిచ్చి..నాపై ప్రేమాభిమానాలు చూపించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. మీకు వినోదాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ మరింత కష్టపడి పనిచేస్తా..ప్రేమతో’..అంటూ లవ్ సింబల్స్ ను జతచేశాడు. దీంతో వరుణ్ తేజ్ పోస్ట్ కి చాలా మంది మెగా అభిమానులు మెగా ఫామిలీ లో బంగారం లాంటి హీరో ఎన్నో విజయాలు సాధిస్తూ రాబోయే రోజుల్లో మమ్మల్నందర్నీ అలరించాలి అని శుభాకాంక్షలు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: