గత  కొంత కాలంగా  కింగ్ నాగార్జున  కు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వరుసగా 5పరాజయాలను చవిచూశాడు.  అందులో  రెండు  భారీ డిజాస్టర్ లు కూడా వున్నాయి.  గత ఏడాది  ఆఫీసర్   నాగ్ కు చేదు జ్ఞాపకాన్ని  మిగిల్చగ  ఈఏడాది మన్మథుడు 2 తో అదే సీన్ రిపీట్ అయ్యింది.  ఈరెండు చిత్రాలు నాగ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి. దాంతో  నాగ్  దిద్దుబాటు చర్యలు చేపట్టాడు. కమర్షియల్  సినిమాల  జోలీకి పోకుండా  ఈ సారి ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నాడు. 
 
 
మన్మథుడు 2 తరువాత కొంత గ్యాప్ తీసుకున్న  నాగ్  ప్రస్తుతం  మహర్షి  చిత్రానికి రచయిత గా పనిచేసిన  సాల్మన్ డైరెక్షన్ లో 'వైల్డ్ డాగ్' అనే  చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో  సాంగ్స్ , హీరోయిన్   కు తావులేదు.  ఖైదీ తరహాలో ప్రయోగాత్మకంగా  తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో నాగార్జున , విజయ్ వర్మ అనే  ఎన్ ఐ ఏ ఆఫీసర్ పాత్రలో  నటిస్తున్నాడు. 2009 లో జరిగిన  ఓ ఎన్కౌంటర్ ఆధారంగా  ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు.  ప్రతి సన్నివేశం కూడా  చాలా సహజంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిన్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను విడుదలచేశారు.  మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై  నిరంజన్ రెడ్డి , అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని   నిర్మిస్తున్నారు.  వచ్చే ఏడాది  సమ్మర్ లో ఈ చిత్రం  విడుదలకానుంది. ఇక  ఇటీవల  నాగ్  బాలీవుడ్ లో  బ్రహ్మాస్త్ర అనే చిత్రం లో  నటించాడు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో నాగ్ తోపాటు అమితాబ్ బచ్చన్ ,రన్బీర్ కపూర్ , మౌనీ రాయ్ , అలియా బట్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: