అక్కినేని నాగేశ్వరరావు మనవడుగా నాగార్జున మేనల్లుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుమంత్ ను మొదట్లో చూసిన వారు అతడు మంచి క్రేజీ హీరోగా సెటిల్ అవుతాడు అని అందరు భావించారు. అంతేకాకుండా దీనికితోడు అతడి లుక్ తో పాటు నటన విషయంలో కూడ మంచి ప్రశంసలు రావడంతో అతడిని హీరోగా నిలబెట్టాలని అక్కినేని నాగేశ్వరరావు నాగార్జునలు కూడ సుమంత్ తో మల్టీ స్టారర్ మూవీలను తమ సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తీసారు.

అయితే ఆ సినిమాలు అన్నీ హిట్ కాకపోవడంతో పాటు మధ్యలో సుమంత్ సోలో హీరోగా నటించిన సినిమాలు కూడ ఫెయిల్ అవ్వడంతో అతడు సక్సస్ ఫుల్ హీరోగా రాణించలేకపోయాడు. ఇప్పటికీ అప్పుడప్పుడు అతడు సినిమాలు చేస్తూ తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నా దాదాపు 20 సంవత్సరాలు గడిచిపోయినా సుమంత్ కెరియర్ ను టర్న్ చేసే భారీ హిట్ తగల లేదు. 

అయితే సుమంత్ గుమ్మం వచ్చిన అదృష్టాన్ని అతడు గుర్తించలేకపోయిన ఒక విషయం ఇప్పుడు ఆలస్యంగా బయటపడింది. సుమారు 12 సంవత్సరాల క్రితం పూరీ జగన్నాథ్ అల్లు అర్జున్ తో తీసేన ‘దేశముదురు’ మూవీ అప్పట్లో బ్లాక్ బష్టర్ హిట్. 2007లో సంక్రాంతికి ప్రభాస్ ‘యోగి’ తో పాటు పోటీగా విడుదలైన ‘దేశముదురు’ బన్నీ కెరియర్ ను ఒక మలుపు తిప్పిన సినిమా. 

ఈ సినిమాలో పూరీ డైలాగులు హన్సిక అందాలు అల్లు అర్జున్ డైనమిక్ యాక్షన్ అలీ కామెడీ ట్రాక్ అన్నీ కలిపి ‘దేశముదురు’ మూవీని అప్పట్లో బ్లాక్ బష్టర్ హిట్ గా నిలబెట్టింది. వాస్తవానికి ఈ కథను పూరి అల్లు అర్జున్ కోసం కాకుండా సుమంత్ కోసం వ్రాసిన కథ అని తెలుస్తోంది. ఈ మూవీని సుమంత్ ను హీరోగా చేసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తీయాలని పూరి ప్రయత్నిస్తే ఆ కథ విని సుమంత్ ఆసక్తి కనపరచక పోవడంతో ఆ కథ బన్నీ దగ్గరకు చేరింది. ఈ కథను విన్న వెంటనే అల్లు అర్జున్ మరో ఆలోచన లేకుండా పూరీ దర్శకత్వంలో నటించడం సూపర్ హిట్ కొట్టడం అన్నీ వరసగా జరిగిపోయాయి. అందుకే తలుపుతట్టిన అదృష్టాన్ని గుర్తించలేకపోతే ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సమర్ధత ఉన్నా రాణించలేరు అని అంటారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: