కాలం చాలా వేగంగా గడిచిపోతూనే గాయాలను కూడా అంతే వేగంగా చేసి వెళ్లిపోతుంది. అప్పుడేనా ఈ సంవత్సరం ముగిసింది అనుకునేలా చేసి మళ్లీ తిరిగిరాను నేస్తమా అంటూ వీడ్కోలు పలుకుతుంది. కానీ వెళుతూ వెళ్లుతూ కొందరికి చేదు జ్ఞాపకాలను అందిస్తే, మరికొందరికి మరపురాని మధురమైనా  గుర్తులను బహుమతిగా ఇచ్చింది.

 

 

ఇకపోతే రాజకీయంగా ఎందరో దిగ్గజాలు ఈ 2019లో నింగికెగిసారు. రాజకీయంగానే కాదు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది దిగ్గజాలను కూడా ఈ ఏడాది తీసుకెళ్లి పోయింది. ఇక టాలీవుడ్‌‌లో ఎన్నో తీపి జ్ఞాపకాలతో పాటు విషాదాలను ఈ 2019 సంవత్సరం మిగిల్చింది. అందులో కొందరిని జ్ఞాపకం చేసుకుందాం..

 

 

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల (73) ఈ ఏడాది జూన్ 27న కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆమె.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. ఇక తెలుగు సినిమా స్థాయి మరో మెట్టు ఎక్కించిన శత చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ తన 69 సంవత్సరాల వయస్సులో జూన్ 22న కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన కోడి రామకృష్ణ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా సినిమాలు తెరకెక్కించారు.

 

 

ఇక ఎన్టీఆర్‌ దర్శకత్వంలో ఆయనే కథానాయుడిగా నటించిన ‘సీతారాముల కళ్యాణం’ ద్వారా వెండితెరకు పరిచమయ్యి ఆ తర్వాత అన్ని భాషల్లోనూ 500కు పైగా చిత్రాల్లో నటించిన, సీనియర్‌ నటి గీతాంజలి అక్టోబర్ 31న గుండెపోటుతో కన్నుమూశారు.. గీతాంజలి గారు తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించి మెప్పించారు.. సిని ప్రస్దానంలో ఎన్నటికి మరపురాని మరో నటుడు గొల్లపూడి మారుతీరావు.. చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయం అయిన ఈయన జర్నలిస్టుగా, రచయితగా చెరగని ముద్రవేసారు.

 

 

దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించిన గొల్లపూడి ఆరు నంది అవార్డులు అందుకున్నారు. తెలుగు తెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఎన్నో అద్భుతమైన పాత్రలకు ప్రాణం పోసిన గొల్లపూడి మారుతీరావు చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 12న కన్నుమూశారు.. ఇక మరో హస్య నటుడు వేణుమాధవ్. మిమిక్రీ ఆర్టిస్టుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, అనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకులు మెచ్చిన హాస్యనటుడిగా ఎదిగారు. ఈయన సికింద్రాబాద్‌లోకి యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందతూ సెప్టెంబర్ 25న తుదిశ్వాస విడిచారు.

 

 

వీరే కాకుండా సినీ నటుడు, చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు నారమల్లి శివప్రసాద్‌ సెప్టెంబర్ 21న కన్నుమూశారు. సీనియర్ నటుడు రాళ్లపల్లి నరసింహారావు (73) మే 17న మరణించారు. ఇక నిర్మాతగా  ‘రాధా గోపాలం’, ‘అల్లరి బుల్లోడు’, ‘శ్రీరామచంద్రులు’, ‘ఒట్టేసి చెబుతున్నా’ వంటి చిత్రాల‌కు వ్యవహరించిన అనిల్ కుమార్ ఏప్రిల్ 26న కన్నుమూశారు. ప్రముఖ సినీ గేయ రచయిత శివ గణేష్ ఆగస్టు 14న, జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ షోలో నందమూరి బాలకృష్ణగా మెప్పించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బాల నటుడు గోకుల్ సాయికృష్ణ అక్టోబర్ 17న కన్నుమూశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: