మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు తమ సొంత టాలెంట్ తో సక్సెస్ సాధిస్తూ ప్రేక్షకుల మనసు దోస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ‘ముకుంద’ సినిమాలో హీరోగా నటించారు.  మొదటి సినిమా అయినా తన నటనతో మెప్పించాడు.  ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘కంచె’ మూవీలో వరుణ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.  ఈ సినిమా జాతీయ అవార్డు కైవసం చేసుకుంది.  ఆ తర్వాత వరుసగా వచ్చిన సినిమాల్లో ఫ్లాప్స్, హిట్స్ ఉన్నాయి. అయితే శేకర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ ఈ హీరోని ఫ్యామిలీ హీరోగా మార్చింది.  ఆ తర్వాత తొలిప్రేమ తో మరో మంచి సక్సెస్ సాధించాడు.  

 

పెదనాన్న చిరంజీవి, బాబాయి పవన్ కళ్యాన్ స్ఫూర్తితో తాను సినీ పరిశ్రమలోకి వచ్చానని అంటున్న వరుణ్ తేజ్ తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేస్తున్నాడు. అంతే కాదు యూత్ ఐకాన్ గా నిలుస్తున్నాడు. ఎత్తు సుమారు 6 అడుగుల 4 అంగుళాలు నవ్వు ముఖంతో అమ్మాయిల మనుసు దోచేస్తున్నాడు. ఈ సంవత్సరం అనీల్ రావిపూడి దర్వకత్వంలో వెంకటేష్ తో కలిసి నటించిన ఎఫ్ 2 సూపర్ హిట్ అయ్యింది.  ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించిన గద్దలకొండ గణేష్ సైతం మరో మంచి విజయం అందుకుంది.

 

తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. ఈ యువ నటుడు పరిశ్రమలో ఐదేళ్ల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. తాజాగా తన ఐదేళ్ల జర్నీ ప్రేక్షకులతో పంచుకున్నాడు.  వరుణ్ తేజ్ ఆ తర్వాత సినిమా సినిమాకు కొత్తదనం ఉండేలా కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించాడు. మెగా ఫ్యామిలీ హీరోలు ఎలా ఉండాలో అలా ఉంటూ మాస్ ప్రేక్షకుల మనసు దోచేస్తున్న వరుణ్ మరిన్న సక్సెస్ లు సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: