ఉయ్యాలా జంపాలా సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా నటించిన పునర్నవికి ఆ సినిమా మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. హీరోయిన్ తర్వాత మళ్ళీ అంతటి పేరు పునర్నవికే వచ్చింది. ఆ సినిమా తర్వాత ఆమె క్రాంతి మాధవ్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటించిన "మళ్లీ మళ్ళీ ఇది రాని రోజు" సినిమాలో శర్వానంద్ కూతురుగా చక్కని నటనని కనబరిచింది. ఆ తర్వాత సోలో హీరోయిన్ గా పిట్టగోడ అనే సినిమా చేసింది.

 

 

సినిమా అంతగా ఆడలేదు. అయితే ఈ సినిమాల ద్వారా ఆమెకి వచ్చిన పాపులారిటీ చాలా తక్కువ. కానీ బిగ్ బాస్ షోకి వచ్చాక మాత్రం అమాంతం ఆమె పాపులారిటీ పెరిగిపోయింది. బిగ్ బాస్ షోకి ప్రజల్లో ఉన్న ఆదరణ దృష్ట్యా ఆమెకి విపరీతమైన పాపులారిటూ వచ్చింది. అదీ గాక ఈ షోలో రాహుల్ మరియు పునర్నవి ల మధ్య ఉన్న కెమిస్ట్రీ జనాలకి విపరీతంగా నచ్చేసింది. అదీ గాక జనాల్లో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు కూడా వచ్చాయి.

 

ఈ వార్తలకి వారు స్పందించి వారి మధ్య ఏమీ లేదని, మేం కేవలం స్నేహితులం మాత్రమేనని చెప్పినప్పటికీ వారి మధ్య ఉన్న కెమిస్ట్రీని ఉపయోగించుకుని ఇప్పటి వరకు చాలా షోల్లో పాల్గొన్నారు. అయితే ఇదిలా ఉంటే పునర్నవి తనకి బిగ్ బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీని నిలబెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. లేటెస్ట్ ఫోటో షూట్లతో అభిమానులకి చాలా దగ్గరగా ఉంటోంది.

 

 

అంతే కాదు హాట్ అందాలతో కుర్రకారు మతి పోగొడుతోంది. బిగ్ బాస్ అయిపోయాక ఆమె సైకిల్ అనే సినిమా చేసింది. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఫోటో షూట్లతో రెచ్చిపోయిందనే చెప్పాలి. ఇప్పటి వరకు పునర్నవి ని ఇలా చూసి ఉండరు. పునర్నవిని ఫోటోస్ చూసినవాళ్ళందరూ అమ్మడుకి ఇంతుందా అని నోరెళ్ళబెడుతున్నారు. మరి పునర్నవి ఈ విధంగానైనా మంచి అవకాశాలు వస్తాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: